యెషయా 1:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 పాపిష్ఠి దేశానికి శ్రమ, ఆ ప్రజల దోషం గొప్పది, వారిది దుష్ట సంతానం, అవినీతికి అప్పగించబడిన పిల్లలు! వారు యెహోవాను విడిచిపెట్టారు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. వారు ఆయనను విడిచి తొలగిపోయారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ.వారు యెహోవాను విసర్జించియున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా, దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు. ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు. ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుణ్ణి) ఆ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 పాపిష్ఠి దేశానికి శ్రమ, ఆ ప్రజల దోషం గొప్పది, వారిది దుష్ట సంతానం, అవినీతికి అప్పగించబడిన పిల్లలు! వారు యెహోవాను విడిచిపెట్టారు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. వారు ఆయనను విడిచి తొలగిపోయారు. အခန်းကိုကြည့်ပါ။ |