యెషయా 1:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 నీ అధికారులు ద్రోహులు. వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. అందరూ లంచం ఆశిస్తారు. చెల్లింపుల వెంటబడతారు. తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 మీ అధికారులు తిరుగుబాటు దారులు, దొంగల స్నేహితులు. మీ అధికారులు అందరూ లంచాలు అడుగుతారు, తప్పుడు పనులు చేయటం కోసం డబ్బు స్వీకరిస్తారు. మీ అధికారులంతా ప్రజలను మోసం చేసేందుకు డబ్బు పుచ్చుకొంటారు. మీ అధికారులు అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేయరు. భర్తలు చనిపోయిన స్త్రీల అవసరాలను గూర్చి మీ అధికారులు వినిపించుకోరు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు. အခန်းကိုကြည့်ပါ။ |
“తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.