Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 9:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 శిక్షా దినాలు వస్తున్నాయి, వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి ప్రవక్త మూర్ఖునిగా, ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించినవారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 శిక్షా దినాలు వచ్చేస్తున్నాయి. ప్రతికార దినాలు వచ్చేశాయి. “ప్రవక్తలు బుద్ధిలేని వారు, ఆత్మ మూలంగా పలికే వారు వెర్రివారు.” ప్రజల విస్తార దోషం, వారు చూపిన తీవ్ర శత్రుత్వం మూలంగా ఇశ్రాయేలువారు ఇది తెలుసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 “ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో. శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు నీవు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు. మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చెపుతున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 శిక్షా దినాలు వస్తున్నాయి, వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి ప్రవక్త మూర్ఖునిగా, ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 9:7
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహు తన తోటి అధికారుల దగ్గరకు వెళ్లినప్పుడు, వారిలో ఒకరు, “అంతా క్షేమమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. అందుకు యెహు అన్నాడు, “అతడు, అతని మాటలు మీకు తెలుసు కదా.”


తీర్పు తీర్చే రోజున, దూరం నుండి విపత్తు వచ్చినప్పుడు మీరేమి చేస్తారు? సహాయం కోసం ఎవరి దగ్గరకు పరుగెత్తుతారు? మీ సంపదను ఎక్కడ వదిలివేస్తారు?


యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.


యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును, సీయోను పక్షంగా ప్రాయశ్చిత్తం చేసే ఒక సంవత్సరాన్ని నియమించారు.


నేనే అబద్ధ ప్రవక్తల సూచనలను భంగం చేస్తాను, సోదె చెప్పేవారిని వెర్రివారిగా చేస్తాను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి చదువును వ్యర్థం చేసేది నేనే.


అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.


అనాతోతు ప్రజలకు శిక్ష విధించే సంవత్సరంలో నేను వారికి విపత్తు తెస్తాను కాబట్టి వారికి మిగిలేది కూడా ఉండదు.”


వారి దుష్టత్వానికి, పాపానికి రెట్టింపు ప్రతిఫలమిస్తాను, ఎందుకంటే వారు నా దేశాన్ని నిర్జీవమైన తమ నీచమైన విగ్రహాలతో అపవిత్రం చేశారు వారి అసహ్యమైన విగ్రహాలతో నా వారసత్వాన్ని నింపారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“సమరయ ప్రవక్తల్లో నేను ఇలాంటి అసహ్యకరమైన దాన్ని చూశాను: వారు బయలు పేరిట ప్రవచించి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించారు.


వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.”


‘యెహోవా ఆలయానికి అధిపతిగా ఉండడానికి యెహోయాదా స్థానంలో యెహోవా నిన్ను యాజకునిగా నియమించారు; ప్రవక్తలా ప్రవర్తించే ఉన్మాదిని నీవు ఇనుప సంకెళ్లతో బంధించి కొయ్యకు బిగించాలి.


దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.


నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.


నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, “సమాధానం, సమాధానం” అని వారంటారు.


నీ ప్రవక్తల దర్శనాలు అబద్ధం, పనికిరానివి; చెర నుండి నిన్ను తప్పించడానికి వారు నీ పాపాన్ని బయటపెట్టలేదు. వారు నీకు చెప్పిన ప్రవచనాలు అబద్ధం, తప్పుదారి పట్టించేవి.


“ ‘సమాధానం లేనప్పుడు సమాధానం అంటూ నా ప్రజలను మోసగిస్తున్నారు. ఒకరు కట్టిన బలహీనమైన గోడకు వారు సున్నం వేస్తారు.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: దర్శనమేమి చూడకపోయినా సొంత ఆత్మను అనుసరించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ.


నా ఉగ్రతతో వారిని శిక్షించి వారి మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. వారి మీద నేను పగ తీర్చుకున్నప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’


కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు.


ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు!


దండన రోజున ఎఫ్రాయిం పాడైపోతుంది. తప్పనిసరిగా జరగబోయే దానిని నేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను.


వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా, వాటి మాంసం తిన్నా సరే, యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు. ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాలను శిక్షిస్తారు: వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు.


నా దేవునితో పాటు ఉండే ప్రవక్త ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు, అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి. తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు.


“ఆమోసూ! నీవేం చూస్తున్నావు?” అని ఆయన అడిగారు. “పండిన పండ్ల గంప” అని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “నా ప్రజలైన ఇశ్రాయేలుకు సమయం దగ్గరపడింది; ఇక నేను వారిని శిక్షించకుండా ఉండను.


ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి, ‘ద్రాక్షరసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచిస్తాను’ అంటే, వాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!


వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు, వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము. దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు, మీ కాపరులు హెచ్చరించే రోజు వచ్చింది. ఇప్పుడే మీరు కలవరపడే సమయము.


దాని ప్రవక్తలు నీతిలేనివారు; వారు నమ్మకద్రోహులు. దాని యాజకులు పరిశుద్ధస్థలాన్ని అపవిత్రం చేస్తారు ధర్మశాస్త్రాన్ని హింసిస్తారు.


అది విని ఆయన కుటుంబీకులు, “ఆయనకు మతిపోయింది” అని చెప్పి ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.


ఎందుకంటే లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం దండన నెరవేరే సమయం ఇదే!


కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కోసం మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కోసమే.


ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ