హోషేయ 9:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు, ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది; నేను మీ పూర్వికులను చూసినప్పుడు, అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది. అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు, వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు, తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీపితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యెహోవా ఇలా అంటున్నాడు. “అరణ్యంలో ద్రాక్షపండ్లు దొరికినట్టు ఇశ్రాయేలువారు నాకు దొరికారు. వసంత కాలంలో అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు. అయితే వారు బయల్పెయోరు దగ్గరికి పోయారు. ఆ లజ్జాకరమైన దేవుడికి తమను అప్పగించుకున్నారు. తాము మోహించిన విగ్రహాల్లాగానే వారు కూడా అసహ్యులయ్యారు.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 “నా మట్టుకైతే ఇశ్రాయేలును చూస్తుంటే, ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు-వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు, ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది; నేను మీ పూర్వికులను చూసినప్పుడు, అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది. అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు, వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు, తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు. အခန်းကိုကြည့်ပါ။ |