Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 8:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు, వారు నా ఆమోదం లేకుండా అధిపతులను ఎన్నుకున్నారు. వారి వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. అవి వారి సొంత నాశనానికే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నాకు అనుకూలులుకాని రాజులను వారు నియమించుకొని యున్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని యున్నారు, విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుటచేత వాటిని పోగొట్టుకొని యున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. కానీ అదంతా వారు నాశనమై పోవడానికే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 ఇశ్రాయేలీయులు తమ రాజులను ఏర్పరచుకొన్నారు. కాని, సలహా కోసం వారు నా దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలీయులు నాయకులను ఏర్పరచుకున్నారు. కానీ నేను ఎరిగిన మనుష్యులను వారు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీయులు తమ వెండి, బంగారం ఉపయోగించి వారికోసం విగ్రహాలు చేసుకొన్నారు. కనుక వారు నాశనం చేయబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు, వారు నా ఆమోదం లేకుండా అధిపతులను ఎన్నుకున్నారు. వారి వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. అవి వారి సొంత నాశనానికే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 8:4
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

సలహా తీసుకున్న తర్వాత రాజు రెండు బంగారు దూడలను చేయించాడు. అతడు ప్రజలతో, “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టము. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించిన మీ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు” అని చెప్పాడు.


ఈ పాపం యరొబాము కుటుంబ పతనానికి వారు భూమి మీద ఉండకుండా నాశనమవ్వడానికి కారణమైంది.


అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.


మనుష్యులు తమ దేవుళ్ళను చేసుకుంటారా? అవును, కానీ వారు దేవుళ్ళు కాదు!”


గతంలో మీరు చేసిన నేరాలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందండి. ఇశ్రాయేలీయులారా! మీరెందుకు మరణాన్ని పొందాలి?


నెబుకద్నెజరు రాజు ఒక బంగారు విగ్రహం చేయించి, దానిని బబులోను దేశంలో దూరా అనే మైదానంలో నిలబెట్టాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు.


ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు; అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు. కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు.


కాబట్టి నేను కోపంలో నీకు రాజును ఇచ్చాను. నా ఆగ్రహంతో అతన్ని తొలగించాను.


ఇప్పుడు వారు మరి ఎక్కువ పాపం చేస్తున్నారు; వారు వెండితో తమ కోసం విగ్రహాలను చేసుకుంటున్నారు, అవి నైపుణ్యంతో చేయబడిన ప్రతిమలు, అవన్నీ కళాకారుని చేతిపనులు. ఈ ప్రజల గురించి ఇలా చెప్తారు, “వారు నరబలులు అర్పిస్తారు! దూడ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటారు!”


ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, విస్తారమైన వెండి, బంగారాలు, ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, వాటిని బయలు కోసం వాడింది.


కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు; కాబట్టి శత్రువులు వారిని తరుముతారు.


“కాని అతడు, ‘నేను మీతో నిజం చెప్తున్న, మీరు ఎవరో నాకు తెలియదు’ అని జవాబిచ్చాడు.


ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మాకోసం తలుపు తెరవండి’ అని వేడుకొంటారు. “కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు.


“కాని అతడు, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అంటాడు.


“నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కోసం నేను నా ప్రాణం పెడతాను.


కాని ఇప్పుడు మీరు దేవున్ని తెలుసుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనుకకు ఆ బలహీనమైన దిక్కుమాలిన సిద్ధాంతాల వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు మళ్ళీ వాటికి బానిసలవ్వాలని కోరుకుంటున్నారా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ