Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 8:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి రాజభవనాలను కట్టుకున్నారు; యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాల మీద అగ్ని కురిపిస్తాను, అది వాటి కోటలను దహించి వేస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఇశ్రాయేలువారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఇశ్రాయేలువారు తమ సృష్టికర్త అయిన దేవుని మర్చి పోయారు. తమ కోసం భవనాలు కట్టించుకున్నారు. యూదావారు, చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాలను తగలబెడతాను. వారి కోటలను ధ్వంసం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఇశ్రాయేలీయులు నివాసాలు నిర్మించారు. కానీ వారు తమను చేసిన సృష్టికర్తను మరచిపోయారు. ఇప్పుడు యూదా కోటలు కట్టింది. కానీ యూదా పట్టణాల మీదికి నేను అగ్నిని పంపిస్తాను. ఆ అగ్ని దాని రాజభవనాలను నాశనం చేస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి రాజభవనాలను కట్టుకున్నారు; యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాల మీద అగ్ని కురిపిస్తాను, అది వాటి కోటలను దహించి వేస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 8:14
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

యరొబాము ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలు కట్టించి, లేవీయులు కాకపోయినా సరే, సాధారణ ప్రజలనే యాజకులుగా నియమించాడు.


అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.


రాజైన హిజ్కియా పాలన యొక్క పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.


అతడు అరణ్యంలో బురుజులు కూడా నిర్మించాడు అనేక తొట్టెలను తవ్వాడు, ఎందుకంటే అతనికి పర్వత ప్రాంతాల్లో మైదానంలో చాలా పశువులు ఉన్నాయి. అతడు మట్టిని ప్రేమిస్తున్నందున కొండల్లో సారవంతమైన భూములలో తన పొలాలను ద్రాక్షతోటలను పని చేసేవారిని కలిగి ఉన్నాడు.


అతడు యూదా కొండ ప్రాంతంలో పట్టణాలు అడవుల్లో కోటలు బురుజులు నిర్మించాడు.


వారిని రక్షించిన దేవున్ని, ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు,


రండి, సాగిలపడి ఆరాధించుదాం, మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;


నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు; నీ బలానికి ఆధారమైన బండను గుర్తు చేసుకోలేదు. కాబట్టి నీవు అందమైన తోటలు పెంచినా వాటిలో విదేశీ ద్రాక్షతీగెలు నాటినా,


వారు వారి పిల్లల మధ్య నేను చేసే కార్యాలను చూసినప్పుడు, వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు: యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు.


యెహోవా శూరునిలా బయలుదేరతారు యోధునిలా ఆయన తన రోషాన్ని రేకెత్తిస్తారు; ఆయన హుంకరిస్తూ యుద్ధ నినాదం చేస్తూ, తన శత్రువుల మీద గెలుస్తారు.


కాబట్టి ఆయన వారిమీద తన కోపాగ్నిని యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించారు. అది వారి చుట్టూ మంటలతో చుట్టుకుంది, అయినా వారు గ్రహించలేదు; అది వారిని కాల్చింది, కాని వారు దాన్ని పట్టించుకోలేదు.


వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.


“ఇటుకలు పడిపోయాయి, కాని మనం చెక్కిన రాళ్లతో మళ్ళీ కడదాము; రావి చెట్లు నరకబడ్డాయి, వాటికి బదులుగా దేవదారులను వేద్దాం” అని అంటారు.


గర్వం, అహంకారంతో నిండిన హృదయం కలిగిన ప్రజలందరు అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు దానిని తెలుసుకుంటారు.


అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”


ఒక యువతి తన నగలు, ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా? అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు, నన్ను మరచిపోయారు.


తమ పూర్వికులు బయలును ఆరాధించి నా పేరును మరచిపోయినట్లే, వీరు ఒకరికొకరు చెప్పుకునే కలలు నా ప్రజలు నా పేరును మరచిపోయేలా చేస్తాయని వీరు అనుకుంటున్నారు.


ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, బంజరు కొండలమీద ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.


వారు మీ పంటలను, ఆహారాన్ని మ్రింగివేస్తారు, మీ కుమారులను, కుమార్తెలను మ్రింగివేస్తారు; వారు మీ గొర్రెలను, మందలను మ్రింగివేస్తారు, మీ ద్రాక్ష చెట్లను, అంజూర చెట్లను మ్రింగివేస్తారు. మీరు నమ్ముకునే కోటగోడలు గల పట్టణాలను వారు ఖడ్గంతో నాశనం చేస్తారు.


“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.”


నేను వారిని పోషించగా వారు తృప్తి చెందారు. వారు తృప్తి చెందిన తర్వాత గర్వించి; నన్ను మరచిపోయారు.


ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి, నేను ఆమెను శిక్షిస్తాను; ఆమె నగలు ఆభరణాలతో అలంకరించుకుని, తన ప్రేమికుల వెంట వెళ్లిపోయింది, కాని నన్ను మరచిపోయింది” అని యెహోవా చెప్తున్నారు.


జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. “మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు కాబట్టి, నేను కూడా మిమ్మల్ని నా యాజకులుగా ఉండకుండా త్రోసివేస్తున్నాను; మీరు మీ దేవుని ఉపదేశాన్ని పట్టించుకోలేదు కాబట్టి, నేను కూడా మీ పిల్లలను పట్టించుకోను.


నేను తూరు ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.”


నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.”


నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను, యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు, అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది.


నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను, అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది.


నేను యూదా మీదికి అగ్నిని పంపుతాను, అది యెరూషలేము కోటలను దగ్ధం చేస్తుంది.”


ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము.


మీకు తండ్రిగా ఉన్న ఆశ్రయ దుర్గాన్ని మీరు విడిచిపెట్టారు; మీకు జన్మనిచ్చిన దేవుని మీరు మరచిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ