Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 5:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 “ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగుచేయజాలడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు. తన పుండును యూదా చూశాడు. ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు. ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. అయితే అతడు నిన్ను బాగు చేయలేకపోయాడు. నీ పుండు నయం చేయలేకపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు. కనుక వారు సహాయంకోసం అష్షూరు వెళ్లారు. తమ సమస్యలనుగూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు. కాని ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 “ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 5:13
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.


ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.


ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరుకు దూతలను పంపి, “నేను మీ దాసున్ని మీ బానిసను. మీరు వచ్చి, నాపై దాడి చేస్తున్న అరాము ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను రక్షించండి” అని చెప్పాడు.


కాని ఆ రోజు అతడు కేక వేసి, “నా దగ్గర పరిష్కారం లేదు. నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది.


“ఒహోలా నాదానిగా ఉన్నప్పుడే వ్యభిచారం చేసింది; అది తన ప్రేమికులైన అష్షూరు వారిని మోహించింది.


అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.


ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.


అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.”


ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు; ఆమె వారిని వెదుకుతుంది కాని వారు కనబడరు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్తాను, ఇప్పటి కంటే అప్పుడే నా స్థితి బాగుండేది.’


“ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.


వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా, అష్షూరుకు వెళ్లారు, ఎఫ్రాయిం తనను తాను విటులకు అమ్ముకుంది.


ఎందుకంటే సమరయ తెగులు బాగు చేయలేనిది; అది యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల ద్వారాల వరకు, యెరూషలేము వరకు కూడా వ్యాపించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ