Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 10:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 అప్పుడు వారు, “మనకు రాజు లేడు ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 –రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 వాళ్ళిలా అంటారు. “మనకు రాజు లేడు, మనం యెహోవాకు భయపడం. రాజు మనకేమి చేస్తాడు?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 ఇప్పుడు, “మాకు రాజు లేడు. మేము యెహోవాను గౌరవించము. అయినా రాజు మాకు ఏమీ చేయలేడు.” అని ఇశ్రాయేలీయులు చెపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 అప్పుడు వారు, “మనకు రాజు లేడు ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 10:3
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.


యూదా రాజైన ఉజ్జియా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, యాబేషు కుమారుడైన షల్లూము రాజయ్యాడు, అతడు సమరయలో నెలరోజులు పరిపాలించాడు.


రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.


“మా నాలుకలతో మేము గెలుస్తాం; మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” అని వారంటారు.


“దేవుడు త్వరపడాలి; ఆయన పనిని త్వరగా చేయాలి అప్పుడు ఆయన కార్యాలు మేము చూస్తాము. ఇశ్రాయేలు పరిశుద్ధుని ఆలోచన ఆచరణలోకి రావాలి, అప్పుడు మేము తెలుసుకుంటాము” అనే వారికి శ్రమ.


బేతేలు, నీకు ఇలా జరుగుతుంది, ఎందుకంటే, నీ దుష్టత్వం ఘోరంగా ఉంది. ఆ రోజు ఉదయించినప్పుడు, ఇశ్రాయేలు రాజు సంపూర్ణంగా నాశనమవుతాడు.


సమరయ రాజు నాశనమవుతాడు, అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు.


“వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా? అష్షూరు రాజు వారిమీద అధికారం చేయడా? ఎందుకంటే వారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.


నిన్ను కాపాడగలిగే నీ రాజు ఎక్కడా? మీ పట్టణాలన్నిటిలో ఉండే మీ అధిపతులు ఎక్కడా? వారి గురించి నీవు, ‘నాకు రాజును అధిపతులను ఇవ్వండి’ అని నీవు అడిగావు కదా?


కాబట్టి నేను కోపంలో నీకు రాజును ఇచ్చాను. నా ఆగ్రహంతో అతన్ని తొలగించాను.


ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా కాలం రాజు గాని పాలకుడు గాని లేకుండా, బలులు గాని పవిత్ర రాళ్లు గాని లేకుండా, ఏఫోదు గాని గృహ దేవుళ్ళు గాని లేకుండా ఉంటారు.


ఇప్పుడు మీరెందుకు కేకలు వేస్తున్నారు? మీకు రాజు లేడా? మీ పరిపాలకుడు నాశనమయ్యాడా? స్త్రీ ప్రసవవేదన పడినట్లు మీరెందుకు వేదన చెందుతున్నారు?


కాని వారు, “అతన్ని తీసుకెళ్లండి! అతన్ని తీసుకెళ్లండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు. అప్పుడు ముఖ్య యాజకులు, “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.


అయినప్పటికీ మీరు చెడు చేయడం కొనసాగిస్తే మీరు, మీ రాజు నాశనమవుతారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ