Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హెబ్రీయులకు 5:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 యేసు భూమి మీద జీవించిన రోజుల్లో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీటితో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 యేసు భూమి మీద జీవించిన రోజుల్లో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీటితో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

7 యేసు భూమి మీద జీవించిన రోజులలో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీళ్లతో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హెబ్రీయులకు 5:7
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు.


దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి.


యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.


యెహోవా చెప్పే మాట ఇదే: “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను, రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను; దేశాన్ని పునరుద్ధరించి పాడైన స్వాస్థ్యాలను పంచడానికి బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని, చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి,


అతడు శ్రమ పొందిన తర్వాత జీవిత వెలుగును చూసి తృప్తి చెందుతాడు; నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు, వారి దోషాలను అతడు భరిస్తాడు.


అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా, శ్రమలు అనుభవించినవానిగా, బాధను ఎరిగినవానిగా ఉన్నాడు. ప్రజలు అతన్ని చూడకుండ ముఖం దాచుకుంటారు; అతడు నిర్లక్ష్యం చేయబడ్డాడు, మనం అతన్ని చిన్న చూపు చూశాము.


దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు తీసుకురావాలి. యాజకుడు ఒక పిడికెడు పిండి, నూనె, ధూపమంతటితో పాటు తీసుకుని బలిపీఠం మీద దానిని ఒక జ్ఞాపకార్థ భాగంగా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా దహించాలి.


ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, “నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు?” అని అర్థము.


యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు.


మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థము.


గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.


అప్పుడు యేసు, “తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను” అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు.


ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.


నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు. అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు.


యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు: “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు.


శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారబలిగా తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు.


అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారున్ని పంపారు; ఆయన ఒక స్త్రీకి జన్మించి, మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్నవారిని విడిపించాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యారు.


నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూశారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకెళ్లారు.


ఆ చిత్తాన్ని బట్టి, యేసు క్రీస్తు శరీరాన్ని అందరి కోసం ఒక్కసారే అర్పించుట ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము.


అందుకని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు ఇలా అన్నారు: “బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నాకొక శరీరాన్ని సిద్ధపరచారు;


విశ్వాసం ద్వారానే నోవహు అప్పటివరకు చూడనివాటి గురించి హెచ్చరించబడి పవిత్ర భయం కలిగినవాడై తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించాడు. తన విశ్వాసం వల్లనే అతడు లోకాన్ని ఖండిస్తూ విశ్వాసంతో కొనసాగుతూ నీతికి వారసుడయ్యాడు.


మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొంటున్నాం కాబట్టి, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం,


నిత్య నిబంధన యొక్క రక్తం ద్వారా గొర్రెల గొప్ప కాపరియైన, ప్రభువైన యేసును మృతులలో నుండి తిరిగి వెనుకకు తెచ్చిన సమాధానకర్తయైన దేవుడు,


ఈ పిల్లలు రక్తమాంసాలు కలిగి ఉన్నవారు కాబట్టి, తన మరణం ద్వారా మరణంపై అధికారం కలవాడైన అపవాది అధికారాన్ని విరుగగొట్టడానికి,


అయితే యేసు దేవుని నుండి వచ్చారని ఒప్పుకొనని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధి ఆత్మ. అది వస్తున్నదని మీరు విన్నారు కాని ఇప్పటికే అది లోకంలోనికి వచ్చి ఉన్నది.


ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మనుష్యునిగా వచ్చారని ఒప్పుకొనని మోసగాళ్లు చాలామంది లోకంలో బయలుదేరారు. వారు క్రీస్తు విరోధులు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ