Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హెబ్రీయులకు 3:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపెట్టినయెడల మనమే ఆయన యిల్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్నవారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందినవాళ్ళమౌతాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

6 అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హెబ్రీయులకు 3:6
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.


యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి.


నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు.


నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.


కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.


దేవుడు చూపించే దయను, కఠినత్వాన్ని తెలుసుకోండి: పడిపోయిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నారు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశారు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు.


నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.


పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.


ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం.


మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?


మీ శరీరాన్ని దేవుడే ఇచ్చారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.


దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు: “నేను వారితో నివసిస్తాను వారి మధ్య నడుస్తాను, నేను వారి దేవునిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”


కాబట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ప్రజలందరికి మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందిన వారికి మంచి చేద్దాము.


మంచి చేయడంలో మనం అలసి పోవద్దు ఎందుకంటే మానక చేస్తే తగిన కాలంలో మనం పంటను కోస్తాము.


ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము.


అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.


మన ప్రభువైన యేసు క్రీస్తును మన తండ్రియైన దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి,


త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా ఉన్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను.


కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.


కాబట్టి, సహోదరీ సహోదరులారా, యేసు తన శరీరమనే తెర ద్వారా మన కోసం తెరవబడిన సజీవమైన ఒక క్రొత్త మార్గం ద్వారా,


దేవుని గృహంపైన ఒక గొప్ప యాజకుని మనం కలిగి ఉన్నాము.


వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.


కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.


విశ్వాసమనేది మనం ఎదురు చూసే వాటిని గురించిన నమ్మకం, మన కళ్లముందు లేనివాటిని గురించిన నిశ్చయత.


ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.


కాబట్టి, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాము.


కాబట్టి, పరలోకానికి ఎక్కివెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాము.


కాబట్టి మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాము.


మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగి ఉన్న నిరీక్షణ సంపూర్ణంగా నెరవేరేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాము.


దేవుడు అబద్ధమాడడం అసాధ్యమైన రెండు మార్పులేని విషయాల ద్వారా, మన ముందు ఉంచిన నిరీక్షణను పట్టుకోవడానికి పరుగెత్తిన మనల్ని ఎంతో ప్రోత్సహించగలిగేలా, దేవుడు ఇలా చేశారు.


ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దేన్ని పరిపూర్ణం చేయలేదు, కాబట్టి మనల్ని దేవునికి దగ్గర చేసే, మెరుగైన నిరీక్షణ పరిచయం చేయబడింది.


మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు.


మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.


తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైంది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి?


“తుయతైరలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: అగ్ని జ్వాలల్లాంటి కళ్లు, తళతళ మెరుస్తున్న కంచును పోలిన పాదాలు గల దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు:


కాని నేను వచ్చేవరకు నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.’


అంతం వరకు నా చిత్తాన్ని నెరవేరుస్తూ జయించినవారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద వారికి అధికారం ఇస్తాను.


నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ