Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హగ్గయి 2:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 పూర్వం ఈ మందిర వైభవాన్ని చూసినవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడది మీకు ఎలా కనబడుతోంది? దానితో పోల్చడానికి ఎందుకూ సరిపోదు కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 –పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచు చున్నది గదా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 పూర్వకాలంలో ఈ మందిరానికి ఉన్న మహిమను చూసినవారు మీలో ఉన్నారు గదా. అలాటి వారికి ఇది ఎలా కనబడుతున్నది? దానితో ఇది ఏ విధంగానూ సరి పోలినది కాదని తోస్తున్నది గదా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 “ఈ ఆలయంయొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తు ఉంది? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 పూర్వం ఈ మందిర వైభవాన్ని చూసినవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడది మీకు ఎలా కనబడుతోంది? దానితో పోల్చడానికి ఎందుకూ సరిపోదు కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హగ్గయి 2:3
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు, “నా కుమారుడైన సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు, యెహోవాకు కట్టవలసిన మందిరపు కీర్తి, వైభవం బట్టి అది అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందాలి. కాబట్టి దాని నిర్మాణానికి కావలసిన వాటిని నేను సిద్ధం చేస్తాను” అని చెప్పి దావీదు చనిపోవడానికి ముందే విస్తారంగా సామాగ్రిని సిద్ధం చేశాడు.


కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.


అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు.


మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి.


అందమైన ఆభరణాల బట్టి గర్వించి హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.


‘ఇప్పుడున్న మందిర వైభవం గత మందిర వైభవం కన్నా అధికంగా ఉంటుంది’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ స్థలంలో నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ