ఆదికాండము 48:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నేను పద్దన నుండి తిరిగి వస్తున్నప్పుడు, మేము ఇంకా దారిలో ఉండగానే, కనాను దేశంలో, ఎఫ్రాతాకు కొద్ది దూరంలో రాహేలు చనిపోయింది. కాబట్టి నేను ఆమెను ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) దారి ప్రక్కన సమాధి చేశాను.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను” అని యాకోబు చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా (ఎఫ్రాతా బెత్లెహేము) వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేశాను.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నేను పద్దన నుండి తిరిగి వస్తున్నప్పుడు, మేము ఇంకా దారిలో ఉండగానే, కనాను దేశంలో, ఎఫ్రాతాకు కొద్ది దూరంలో రాహేలు చనిపోయింది. కాబట్టి నేను ఆమెను ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) దారి ప్రక్కన సమాధి చేశాను.” အခန်းကိုကြည့်ပါ။ |
ఈ రోజు నీవు నా దగ్గరి నుండి వెళ్లిన తర్వాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనబడతారు. వారు నీతో, ‘నీవు వెదకుతున్న గాడిదలు దొరికాయి. నీ తండ్రి వాటి గురించి ఆలోచించడం మాని నీకోసం కంగారు పడుతూ, “నా కుమారుని గురించి నేనేమి చేయాలి?” అని అడుగుతున్నాడు’ అని చెప్తారు.