ఆదికాండము 19:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “నా ప్రభువులారా! దయచేసి మీ దాసుని ఇంటికి రండి, మీ కాళ్లు కడుక్కుని ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి, వేకువజామున లేచి వెళ్లవచ్చు” అని వారితో అన్నాడు. అప్పుడు వారు, “లేదు, ఈ రాత్రి నడి వీధిలోనే ఉంటాం” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు–ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 వారితో ఇలా అన్నాడు “నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలనీ, ఈ రాత్రి గడపాలనీ వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” అన్నాడు. అందుకు వాళ్ళు “అలా కాదు. మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం.” అన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” “లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “నా ప్రభువులారా! దయచేసి మీ దాసుని ఇంటికి రండి, మీ కాళ్లు కడుక్కుని ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి, వేకువజామున లేచి వెళ్లవచ్చు” అని వారితో అన్నాడు. అప్పుడు వారు, “లేదు, ఈ రాత్రి నడి వీధిలోనే ఉంటాం” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။ |