Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 18:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి, వారి ముందు వంగి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 18:2
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు,


ఆ మనుష్యులు వెళ్లడానికి లేచి సొదొమ, గొమొర్రాల వైపు చూశారు, అబ్రాహాము వారిని పంపించడానికి వారితో పాటు వెళ్లాడు.


ఆ మనుష్యులు అక్కడినుండి సొదొమ వైపు వెళ్లారు, అయితే అబ్రాహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు.


అబ్రాహాము వారితో, “నా ప్రభువా, మీ దృష్టిలో నేను దయ పొందినట్లైతే, మీ దాసున్ని విడిచి వెళ్లకండి.


ఆ సాయంత్రం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు, లోతు సొదొమ పట్టణ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతడు వారిని చూడగానే, వారిని కలవడానికి లేచి వారి ఎదుట సాష్టాంగపడ్డాడు.


మళ్ళీ అబ్రాహాము ఆ దేశ ప్రజలందరి ఎదుట తలవంచాడు,


అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హిత్తీయుల ఎదుట తలవంచాడు.


ఒక రోజు సాయంకాలం అతడు ధ్యానం చేసుకోవడానికి పొలానికి వెళ్లాడు; ఆ సమయంలో ఇస్సాకు తేరిచూడగా, అతనికి ఒంటెలు వస్తున్నట్లు కనిపించాయి.


యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారే వరకు ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు.


అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారిగా ఉంటూ, ఆ దేశ ప్రజలందరికి ధాన్యం అమ్మేవాడు. యోసేపు అన్నలు వచ్చి అతనికి సాష్టాంగపడి నమస్కారం చేశారు.


యోసేపు ఇంటికి రాగానే, వారు ఇంట్లోకి తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చి, అతని ఎదుట సాష్టాంగపడ్డారు.


వారు జవాబిస్తూ, “తమ దాసుడు, మా తండ్రి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అన్నారు, అప్పుడు వారు తలవంచి, సాష్టాంగపడ్డారు.


యూదా అతని సోదరులు వచ్చినప్పుడు యోసేపు ఇంట్లోనే ఉన్నాడు, వారు అతని ఎదుట సాష్టాంగపడ్డారు.


అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు.


దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.


అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి.


క్రొత్తవారికి ఆతిథ్యం ఇవ్వడం మరువవద్దు, ఎందుకంటే క్రొత్తవారికి ఆతిథ్యం ఇస్తుండడం వలన కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు.


యెహోషువ యెరికోకు సమీపంలో ఉన్నప్పుడు, అతడు పైకి చూసినప్పుడు ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని తన ముందు నిలబడి కనిపించాడు. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా పక్షమా లేదా మా శత్రువుల పక్షమా?” అని అడిగాడు.


సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి.


యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు.


అందుకు ఆమె తలవంచి సాష్టాంగపడి, “నేను పరదేశిని, మీరు నన్ను గమనించేటంత దయ మీ దృష్టిలో ఎలా సంపాదించుకున్నాను?” అని ఆమె అతన్ని అడిగింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ