Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 12:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అబ్రాము తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడైన లోతును, హారానులో వారు కూడబెట్టుకున్న మొత్తం ఆస్తిని, సంపాదించుకున్న ప్రజలను తీసుకుని కనాను దేశం చేరుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానునువారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపా దించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము, అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అబ్రాము తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడైన లోతును, హారానులో వారు కూడబెట్టుకున్న మొత్తం ఆస్తిని, సంపాదించుకున్న ప్రజలను తీసుకుని కనాను దేశం చేరుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 12:5
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)


ఇది తెరహు కుటుంబ వంశావళి. తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.


తెరహు తన కుమారుడైన అబ్రామును, తన మనవడు, హారాను కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారాయిని తీసుకుని కల్దీయుల ఊరు నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో వారు హారానుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.


అబ్రాముతో కలిసి ప్రయాణిస్తున్న లోతుకు కూడా గొర్రెలు, మందలు, గుడారాలు ఉన్నాయి.


వీరిద్దరి ఆస్తులు ఎంతో అధికంగా ఉండడం వల్ల వీరు కలిసి ఉండడానికి ఆ స్థలం సహకరించలేదు.


అబ్రాము తన బంధువు బందీగా కొనిపోబడ్డాడు అని విన్నప్పుడు, తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మందిని తీసుకుని వారిని దాను వరకు తరిమాడు.


సొదొమ రాజు, “చెరగా తెచ్చిన ప్రజలను నాకు ఇవ్వండి, వస్తువులను మీ కోసం పెట్టుకోండి” అని అబ్రాముతో అన్నాడు.


యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు.


ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు.


అయితే ఒకవేళ యాజకుడు డబ్బుతో బానిసను కొనుగోలు చేస్తే, లేదా బానిసలు అతని కుటుంబంలో జన్మించి ఉంటే, వారు అతని ఆహారాన్ని తినవచ్చు.


“కాబట్టి అతడు కల్దీయుల దేశాన్ని విడిచివెళ్లి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, నేడు మనం నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని పంపారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ