Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 7:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 ఎజ్రా! నీవు నీకున్న నీ దేవుని జ్ఞానంతో, యూఫ్రటీసు నది అవతలి ప్రజలకు న్యాయం తీర్చడానికి, నీ దేవుని న్యాయవిధులు తెలిసినవారిని నీవే అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించు. అవి తెలియని వారికి నీవు వాటిని బోధించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 ఎజ్రా, నీవు నది అవతలి వైపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానంతో నువ్వు నీ దేవుని ధర్మశాస్త్ర విధులు తెలిసిన వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించాలి. ధర్మశాస్త్ర విధులు తెలియని వారికి వాటిని నేర్పించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నీవు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 ఎజ్రా! నీవు నీకున్న నీ దేవుని జ్ఞానంతో, యూఫ్రటీసు నది అవతలి ప్రజలకు న్యాయం తీర్చడానికి, నీ దేవుని న్యాయవిధులు తెలిసినవారిని నీవే అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించు. అవి తెలియని వారికి నీవు వాటిని బోధించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 7:25
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు.


అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు.


రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.


అప్పుడు అష్షూరు రాజు, “సమరయ నుండి బందీలుగా తీసుకువచ్చిన యాజకులలో ఒకడిని అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తూ ఆ దేశ దేవుని నియమాలను ఆ ప్రజలకు బోధించడానికి పంపించండి” అని ఆజ్ఞాపించాడు.


నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరించేలా ఆయన నిన్ను ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమించినప్పుడు, యెహోవా నీకు వివేకాన్ని జ్ఞానాన్ని ఆయన ఇచ్చును గాక.


దావీదు, “వీరిలో ఇరవైనాలుగు వేలమంది యెహోవా ఆలయ పని బాధ్యత తీసుకోవాలి, ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా ఉండాలి.


లెండి; ఈ పని మీ చేతిలోనే ఉంది. మేము మీకు మద్ధతు ఇస్తాం కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి” అన్నాడు.


అందుకు ఇప్పుడు, యూఫ్రటీసు నది అవతల అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు దీనికి దూరంగా ఉండాలి.


యెహోవా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం చేయాలని, ఇశ్రాయేలీయులకు దాని శాసనాలను, న్యాయవిధులను నేర్పించాలని ఎజ్రా నిశ్చయించుకున్నాడు.


నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యూదా గురించి యెరూషలేము గురించి పరిశీలించడానికి రాజు అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపించారు.


వారు ఉన్న చోటే నిలబడి ఒక పూటంతా తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకుంటూ తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ గడిపారు.


యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా కట్టడలు నమ్మదగినవి, అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.


ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు; తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.


ఈ ఆజ్ఞ దీపంగా ఈ బోధ వెలుగుగా క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా జీవమార్గాలుగా ఉండి,


“యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.


యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన ధననిధి నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు.


యేసు పడవ దిగి, గొప్ప జనసమూహం రావడం చూసినప్పుడు, వారు కాపరి లేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు.


మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, అధికారులను మీరు నియమించాలి, వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.


మేము అందరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో అందరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము.


మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ