Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 6:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుని మందిరం పని విషయంలో యెహోవా అష్షూరురాజు మనసు మార్చి వారికి ధైర్యం కలిగించి వారు ఆనందభరితులయ్యేలా చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 వాళ్లు ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అష్షూరు రాజు మనోవైఖరిని మార్చి, యెహోవా వాళ్లకెంతో సంతోషం కలిగించాడు. దానితో, అష్షూరు రాజు దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం చేందుకు వాళ్లకి తోడ్పడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 6:22
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోషీయా రాజుగా ఉన్నప్పుడు, ఈజిప్టు రాజైన ఫరో నెకో యూఫ్రటీసు నది దగ్గర అష్షూరు రాజుకు యుద్ధంలో సహాయపడడానికి వెళ్లాడు. రాజైన యోషీయా అతన్ని ఎదుర్కోబోయాడు, అయితే నెకో అతన్ని మెగిద్దో దగ్గర చంపాడు.


అప్పుడు యెహోయాదా, దావీదు ఆదేశించిన ప్రకారం, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు సంతోషంతో పాడుతూ, యెహోవాకు దహనబలులను అర్పించడానికి, మందిరంలో దావీదు నియమించిన లేవీయులకు యాజకులకు యెహోవా ఆలయ పర్యవేక్షణ అప్పగించాడు.


దావీదు, దీర్ఘదర్శియైన ఆసాపు వ్రాసిన కీర్తనలు పాడి యెహోవాను స్తుతించాలని లేవీయులకు హిజ్కియారాజు అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతిగానం చేస్తూ తలలు వంచి ఆరాధించారు.


యెరూషలేములో హాజరైన ఇశ్రాయేలు వారు మహానందంతో పులియని రొట్టె పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతిరోజు లేవీయులు, యాజకులు యెహోవాకు పాటలు పాడారు. యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు.


అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.


అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ సమయంలో పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు.


పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:


అప్పుడు రాజైన దర్యావేషు ఆదేశించగా వారు బబులోను ఖజానాలోని రాజ్య దస్తావేజులన్ని పరిశోధించారు.


యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయానికి ఈ విధంగా ఘనత చేకూర్చేందుకు రాజు హృదయాన్ని కదిలించిన మన పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతి!


అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో నేను యెరూషలేములో లేను. ఎందుకంటే బబులోను దేశపు రాజైన అర్తహషస్త పాలన ముప్పై రెండవ సంవత్సరంలో నేను రాజు దగ్గరకు తిరిగి వెళ్లాను. కొంతకాలం తర్వాత నేను రాజు అనుమతి తీసుకుని,


ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు.


యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.


బబులోనీయులు, కల్దీయులందరూ, పేకోదు, షోవ, కోవ యొక్క పురుషులు, వారితో ఉన్న అష్షూరీయులందరు, అందమైన యువకులు, అధికారులు, అధిపతులు, రథ అధికారులు ఉన్నత స్థాయి పురుషులు, గుర్రపు స్వారీ చేసే వీరందరిని రప్పిస్తాను.


పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు.


అందుకు యేసు, “నీకు ఆ అధికారం పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదు. కాబట్టి నన్ను నీకు అప్పగించినవాడు నీ కంటే మరి ఎక్కువ పాపం చేశాడు” అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ