Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 8:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, వారు చేస్తున్నది నీవు చూశావు కదా! నా పరిశుద్ధాలయం నుండి నన్ను దూరం చేసేలా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేస్తున్న చాలా అసహ్యకరమైన పనులు చూశావా? కాని వీటి కంటే మరింత అసహ్యకరమైన వాటిని నీవు చూస్తావు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను–నరపుత్రుడా, వారుచేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడచేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, వాళ్ళేం చేస్తున్నారో చూస్తున్నావా? నా సొంత మందిరం నుండి నేను వెళ్ళిపోవడానికి కారణమైన నీచమైన పనులు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నారు! నువ్వు పక్కకి తిరిగి చూస్తే వీటి కంటే అసహ్యమైన పనులు వీరు చేయడం చూస్తావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 మళ్లీ దేవుడు నాకు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారో నీవు చూస్తున్నావా? వారు దానిని ఖచ్చితంగా నా ఆలయం ప్రక్కనే నెలకొల్పారు! నీవు నాతో వస్తే, ఇంకా భయంకరమైన విషయాలు చూస్తావు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, వారు చేస్తున్నది నీవు చూశావు కదా! నా పరిశుద్ధాలయం నుండి నన్ను దూరం చేసేలా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేస్తున్న చాలా అసహ్యకరమైన పనులు చూశావా? కాని వీటి కంటే మరింత అసహ్యకరమైన వాటిని నీవు చూస్తావు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 8:6
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారితో ఇలా చెప్పాడు: “లేవీయులారా! నేను చెప్పేది వినండి! ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుని, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని పవిత్రపరచండి. పరిశుద్ధాలయంలో నుండి అపవిత్రమైన ప్రతిదీ తీసివేయండి.


షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.


సర్వసమాజం మధ్య నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు.”


యెహోవా వారి కుట్రను నాకు తెలియజేశాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో ఆయన నాకు చూపించాడు.


“ప్రవక్త యాజకుడు ఇద్దరూ భక్తిహీనులే; నా మందిరంలో కూడా వారి దుర్మార్గాన్ని నేను చూస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”


యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది.


నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు.


యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు ఏమి చేస్తున్నారో మీరు చూడడం లేదా?


“ ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు.


అప్పుడు యెహోవా మహిమ ఆలయ గుమ్మం మీద నుండి వెళ్లిపోయి కెరూబుల పైన ఆగింది.


నేను చూస్తుండగానే కెరూబులు రెక్కలు విప్పి నేల నుండి పైకి లేచాయి, అవి వెళ్తుండగా చక్రాలు వాటితో పాటు వెళ్లాయి. అవి యెహోవా ఆలయ తూర్పు ద్వారం దగ్గరకు వచ్చి ఆగాయి; ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపైన ఉంది.


అప్పుడు కెరూబులు రెక్కలు విప్పాయి, చక్రాలు వాటి ప్రక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపై ఉంది.


యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకి వెళ్లి తూర్పున ఉన్న కొండ పైన ఆగింది.


“కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీ విగ్రహాలను విడిచిపెట్టి అసహ్యకరమైన ఆచారాలు మానివేసి మనస్సు మార్చుకోండి.


పేదవారిని దరిద్రులను అణచివేస్తాడు. దోపిడీలు చేస్తాడు. అప్పుకు తాకట్టుగా తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడు. అతడు విగ్రహాలవైపు చూస్తాడు. అసహ్యమైన పనులు చేస్తాడు.


నాకు వారికి మధ్య గోడ మాత్రమే ఉంచి, వారు నా గుమ్మం ప్రక్కన తమ గుమ్మాలను, నా గడపల ప్రక్కన తమ గడపలను కట్టి, తమ అసహ్యమైన ఆచారాలతో వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి నేను కోపంతో వారిని నాశనం చేశాను.


“మనుష్యకుమారుడా! ఇది చూస్తున్నావా?” ఆయన నన్ను మరల నది ఒడ్డుకు చేర్చాడు.


నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


ఆయన ఇంకా నాతో, “నీవు ఈ వైపుకు తిరిగి చూస్తున్నావా? వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.


ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు.


అప్పుడు ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ నేను చూడగా, నాకు గోడకు ఒక రంధ్రం కనిపించింది.


ఆయన నాతో, “లోపలికి వెళ్లి వారు ఇక్కడ చేస్తున్న దుర్మార్గమైన అసహ్యకరమైన పనులు చూడు” అని చెప్పారు.


వారు యెహోవాను వెదకడానికి తమ గొర్రెలను, పశువులను వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు, ఆయనను కనుగొనరు; ఎందుకంటే ఆయన వారికి దూరంగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ