Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 8:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆయాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలైన డెబ్భై మంది అక్కడ ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కొడుకు యజన్యా ఉన్నాడు. వాళ్ళంతా ఆ బొమ్మలకి ఎదురుగా నిలబడి ఉన్నారు. ప్రతివాడి చేతిలో ధూపం వేసే పాత్ర ఒకటి ఉంది. వాళ్ళంతా ధూపం వేయడం వల్ల అది ఒక మేఘంలా పైకి వెళ్తూ ఉంది. దాని పరిమళం అంతటా నిండి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 అక్కడ షాఫాము కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 8:11
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:


యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా హుల్దా ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె వస్త్రశాల తనిఖీదారుడైన హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూము భార్య, యెరూషలేములో నూతన భాగంలో నివసించేది.


అతని పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో రాజైన యోషీయా మెషుల్లాము మనుమడును అజల్యా కుమారుడును, కార్యదర్శియునైన షాఫానును యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి పంపాడు. అతడు ఇలా చెప్పాడు:


ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని చెప్పి దానిని షాఫానుకు ఇచ్చాడు.


బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు.


ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు.


ధూపం వేయడానికి చేతిలో ధూపం పెట్టుకున్న ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు యెహోవా మందిరంలో ధూపవేదిక ముందు యాజకుల సమక్షంలో వారి మీద విరుచుకుపడుతుండగా, అతని నుదుటిపై కుష్ఠురోగం వచ్చింది.


తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:


అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది యెహోవా దగ్గరకు ఎక్కి వచ్చి దూరం నుండి ఆరాధించాలి.


అప్పుడు మోషే అహరోను, నాదాబు అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది పైకి ఎక్కి వెళ్లి,


వడ్రంగి నూలు త్రాడుతో కొలతలు వేసి రూపం యొక్క రూపురేఖలను గుర్తిస్తాడు; అతడు ఉలితో దానిని చెక్కి దిక్సూచితో గుర్తులు పెడతాడు. క్షేత్రంలో అది ఉండడానికి దానికి నర రూపాన్ని ఇచ్చి నర సౌందర్యం కలదానిగా తయారుచేస్తాడు.


యెహోవా ఇలా అంటున్నారు: “వెళ్లి కుమ్మరి దగ్గర ఒక మట్టి పాత్ర కొను. నీతో పాటు ప్రజల పెద్దలను, యాజకులలో కొందరిని తీసుకుని,


ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి, ఈ స్థలాన్ని ఇతర దేవతల స్థలంగా చేశారు. వారికి గాని, వారి పూర్వికులకు గాని, యూదా రాజులకు గాని తెలియని దేవతలకు ధూపం వేసి, ఈ స్థలాన్ని నిర్దోషుల రక్తంతో నింపారు.


అయితే రాజైన యెహోయాకీము, అక్బోరు కుమారుడైన ఎల్నాతానును మరికొందరు వ్యక్తులతో పాటు ఈజిప్టుకు పంపాడు.


ఇంకా, షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు అండగా నిలబడ్డాడు, కాబట్టి యిర్మీయాను చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.


యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది:


యెహోవా మందిరంలో కార్యదర్శియైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో యెహోవా మందిర క్రొత్త ద్వార ప్రవేశం దగ్గర ప్రజలందరికి వినిపించేలా బారూకు గ్రంథపుచుట్టలో నుండి యిర్మీయా చెప్పిన మాటలను చదివాడు.


“మీరు, మీ పూర్వికులు, మీ రాజులు, మీ అధికారులు దేశ ప్రజలు, యూదా పట్టణాల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ధూపం వేసిన విషయం యెహోవా గుర్తుంచుకుని జ్ఞాపకం తెచ్చుకోలేదా?


కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడతాను; ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, బంధకాలను తెంపుకున్నారు.


హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా వెళ్లిపోయింది.


“ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ,


ఏడవ సంవత్సరం అయిదవ నెల పదవ రోజున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవాను సంప్రదించడానికి నా దగ్గరకు వచ్చి నా ఎదుట కూర్చున్నారు.


నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి.


ఎవరినీ విడిచిపెట్టకండి. వృద్ధులను, యువకులను, స్త్రీలను, తల్లులను పిల్లలను అందరిని చంపండి కాని ఆ గుర్తు ఉన్నవారిని మాత్రం ముట్టుకోవద్దు. నా పరిశుద్ధాలయం నుండి మొదలుపెట్టండి” అన్నారు. వెంటనే వారు మందిరం ముందున్న వృద్ధులతో మొదలుపెట్టారు.


యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము.


యెహోవా మోషేతో: “ఇశ్రాయేలు గోత్ర పెద్దలను డెబ్బై మందిని నాయకులుగా, ఎవరైతే పెద్దలుగా ఉన్నవారు నీకు తెలిసినవారిని తీసుకురా. నీతో వారు నిలబడేలా వారు సమావేశ గుడారం దగ్గరకు రావాలి.


అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో మాట్లాడారు. అతనిపై ఉన్న ఆత్మ శక్తిలో కొంత ఆ డెబ్బై గోత్ర పెద్దలపై ఉంచినప్పుడు ఆత్మ వారిమీద నిలిచి వారు ప్రవచించారు అయితే, తర్వాత ఎన్నడు ప్రవచించలేదు.


మీలో ప్రతి ఒక్కరు తమ ధూపార్తి చేతపట్టుకుని ధూపం వేయాలి. అన్నీ కలిపి 250 ధూపార్తులు యెహోవా ఎదుట దానిని సమర్పించాలి. నీవు అహరోను కూడా మీ ధూపార్తులు సమర్పించాలి.”


యెహోవా దగ్గర నుండి మంటలు లేచి ధూపారాధన చేసే 250 మందిని కాల్చివేసింది.


ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;


ఆ తర్వాత ప్రభువు ఇంకా డెబ్బైరెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరిగా తాను వెళ్లబోయే ప్రతి పట్టణానికి స్థలానికి తనకు ముందుగా వారిని పంపారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ