Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 7:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 వాటినుండి తప్పించుకున్నవారు పర్వతాల మీదకు పారిపోయి తమ పాపాలను బట్టి వారిలో ప్రతి ఒక్కరు లోయ పావురాల్లా మూల్గుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 వారిలో ఎవ రైనను తప్పించుకొనినయెడల వారందరును లోయలోని గువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అయితే వాళ్ళలో కొంతమంది తప్పించుకుని పర్వతాల పైకి పారిపోతారు. వాళ్ళు అందరూ లోయలో ఉండే గువ్వల్లాగా మూలుగుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 “కాని కొంతమంది ప్రజలు తప్పించుకుంటారు. అలా బ్రతికినవారు పర్వతాలలోకి పారిపోతారు. అయినా వారు సంతోషంగా ఉండలేరు. వారు తమ పాపాలను తలచుకొని కుమిలిపోతారు. వారు ఏడ్చి, పావురాలవలె మూలుగుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 వాటినుండి తప్పించుకున్నవారు పర్వతాల మీదకు పారిపోయి తమ పాపాలను బట్టి వారిలో ప్రతి ఒక్కరు లోయ పావురాల్లా మూల్గుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 7:16
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”


నా మనవి విని నాకు జవాబివ్వండి. నా ఆలోచనలతో నాకు నెమ్మది లేదు.


సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.


యూదా రాజ్యంలో శేషం మరోసారి క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది.


కొంగలా చిన్న పిట్టలా నేను కిచకిచ అరిచాను, దుఃఖపడే పావురంలా మూలిగాను ఆకాశాల వైపు చూసి నా కళ్లు అలసిపోయాయి. నేను బెదిరిపోయాను; ప్రభువా, నాకు సహాయం చేయండి.”


మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము; పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము. మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు. రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.


మా అపరాధాలన్నీ మా ఎదుట ఉన్నాయి మా పాపాలు మామీద సాక్ష్యం ఇస్తున్నాయి. మా అపరాధాలన్నీ ఎల్లప్పుడు మాతో ఉన్నాయి, మా దోషాలు మాకు తెలుసు.


ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, బంజరు కొండలమీద ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.


వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు.


ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.”


ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.


సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”


అయినప్పటికీ దానిలో నుండి బయటకు రప్పించబడిన కుమారులు కుమార్తెలలో కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు. వారు మీ దగ్గరకు వస్తారు, మీరు వారి ప్రవర్తనలో పనులలో తేడాను చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన కీడు గురించి నేను దానికి చేసిన వాటన్నిటి గురించి మీరు ఓదార్పు పొందుతారు.


నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా, ఎత్తైన ప్రతి కొండ మీదా సంచరించాయి. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు, ఎవరూ వాటిని వెదకలేదు, వాటికోసం చూడలేదు.


అప్పుడు మీరు మీ చెడు ప్రవర్తనను, చేసిన చెడ్డపనులను జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన పాపాలు అసహ్యమైన పనులను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.


నీనెవెను బందీగా, తీసుకుపోవాలని శాసించబడింది. ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ, తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు.


యెహోవా మహాదినం సమీపంగా ఉంది, అది ఆసన్నమై త్వరగా రాబోతుంది. యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది; ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ