Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 47:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఈ నది నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జీవరాశుల గుంపులు ఉంటాయి. మృత సముద్రంలో చేపలు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే దాని నీళ్లు మంచి నీటిగా ఉంటాయి. ఈ నీరు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం వర్ధిల్లుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 ఈ నీటిలో చేపలు విస్తారంగా వుంటాయి. ఈ నది ప్రవహించే ప్రాంతంలో అన్ని రకాల జంతువులు నివసిస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఈ నది నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జీవరాశుల గుంపులు ఉంటాయి. మృత సముద్రంలో చేపలు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే దాని నీళ్లు మంచి నీటిగా ఉంటాయి. ఈ నీరు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం వర్ధిల్లుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 47:9
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు.


ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు నీటిని నదుల్లా ప్రవహింపజేశారు.


ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.


మీరు రక్షణ బావులలో నుండి ఆనందంతో నీళ్లు చేదుతారు.


యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.


చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.”


దాహంతో ఉన్నవారలారా, నీళ్ల దగ్గరకు రండి. డబ్బులేని వారలారా, మీరు వచ్చి కొని తినండి! డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా, ద్రాక్షరసం, పాలు కొనండి.


“ఆ రోజున అనేక దేశాలు యెహోవా దగ్గరకు చేరి నా ప్రజలవుతారు. నేను మీ మధ్య నివసిస్తాను, అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.


కొంత కాలమైన తర్వాత ఈ లోకం ఇక నన్ను చూడదు, కాని మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు.


అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.


దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.


కానీ నేనిచ్చే నీళ్లు త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్లు వారిలో నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు.


మరణించినవారు దేవుని కుమారుని స్వరం వినే సమయం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. ఆయన స్వరాన్ని విన్న వారు తిరిగి జీవిస్తారని నేను మీతో చెప్పేది నిజము.


ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి.


అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకున్నారు, ఆ రోజు సుమారుగా మూడువేలమంది వ్యక్తులు సంఘానికి చేర్చబడ్డారు.


వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతిదినం రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.


వారు వాటిని విని దేవుని స్తుతించారు. ఆ తర్వాత వారు పౌలుతో, “సహోదరుడా, చూడు, యూదులలో ఎన్ని వేలమంది విశ్వసించారో, వారందరు ధర్మశాస్త్రం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు.


కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు అయిదువేల వరకు పెరిగింది.


అయినా, మరి ఎక్కువ సంఖ్యలలో స్త్రీలు పురుషులు ప్రభువును నమ్ముకొని విశ్వాసుల గుంపులో చేరారు.


కాబట్టి దేవుని వాక్యం వ్యాపించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అతివేగంగా పెరిగింది, యాజకులలో కూడా చాలామంది విశ్వాసానికి లోబడ్డారు.


ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.


కాబట్టి “మొదటి మనిషియైన ఆదాము జీవి అయ్యాడు” అని వ్రాయబడింది; చివరి ఆదాము జీవాన్నిచ్చే ఆత్మ అయ్యాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ