యెహెజ్కేలు 45:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు “ఇశ్రాయేలీయుల పాలకులారా, ఇంక చాలు! మీరు జరిగించిన బలాత్కారం, దోపిడి చాలించి నా ప్రజల సొమ్మును దోచుకోక నీతి న్యాయాలను అనుసరించండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఇశ్రాయేలు పాలకులారా, ఇక చాలు! ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, వారి సొమ్ము కొల్ల గొట్టటం మానండి! న్యాయవర్తనులై మంచి పనులు చేయండి! నా ప్రజలను వారి ఇండ్ల నుండి వెడల గొట్టటం మానండి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။ |