యెహెజ్కేలు 39:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “ ‘అప్పుడు ఇశ్రాయేలు పట్టణాల్లో నివసించేవారు బయటకు వెళ్లి, ఆ ఆయుధాలను చిన్న పెద్ద డాళ్లు, విల్లులు బాణాలు, యుద్ధ దండాలు ఈటెలను తీసుకుని పొయ్యిలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఏడేళ్లపాటు వాటిని ఇంధనంగా వినియోగించనున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 “ఆ సమయంలో ఇశ్రాయేలు నగరాలలో నివసిస్తున్న ప్రజలు ఆ పొలాలలోకి వెళతారు. వారు శత్రువుల ఆయుధాలన్నీ ఏరి తగలబెడతారు. డాళ్లు, ధనుస్సులు, బాణాలు, దుడ్డు కర్రలు, ఈటెలు అన్నీ వారు తగులబెడతారు. ఆ ఆయుధాలన్నిటినీ వారు ఏడేండ్ల పాటు వంట చెరకుగా ఉపయోగిస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “ ‘అప్పుడు ఇశ్రాయేలు పట్టణాల్లో నివసించేవారు బయటకు వెళ్లి, ఆ ఆయుధాలను చిన్న పెద్ద డాళ్లు, విల్లులు బాణాలు, యుద్ధ దండాలు ఈటెలను తీసుకుని పొయ్యిలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఏడేళ్లపాటు వాటిని ఇంధనంగా వినియోగించనున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |