Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 38:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించుకొని, ఆయా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆయా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 ఎంతో కాలం తరువాత మీరు విధులకు పిలవబడుతారు. తరువాతి సంవత్సరాలలో యుద్ధ బాధలనుండి విముక్తి చెందిన దేశంలోకి మీరు వస్తారు. ఆ దేశపు ప్రజలు తాము ఇతర దేశాలనుండి సమ కూర్చబడి ఇశ్రాయేలు పర్వతం మీదికి తిసుకొని రాబడతారు. గతంలో ఇశ్రాయేలు పర్వతాలు పదే పదే నాశనం చేయబడ్డాయి. అయితే ఈ ప్రజలు మాత్రం ఇతర దేశాల నుండి తిరిగి వచ్చినవారు. వారంతా క్షేమంగా నివసిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 38:8
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నాడు: “చుట్టూ కూడి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో నేను మీకు చెప్తాను.


మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.


చెరసాలలో బంధించబడిన ఖైదీలవలె వారు చెరసాలలో వేయబడతారు. చాలా రోజులు అక్కడ ఉన్న తర్వాత వారు శిక్షించబడతారు.


ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో సైన్యాల యెహోవా వస్తారు.


దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు! దూర దేశాల్లారా! మీరందరూ వినండి. యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి! అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!


అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు అని పిలువబడతాడు.


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.


అవి జరుగబోయే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలును, యూదాను చెరనుండి విడిపించి, వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి వారిని రప్పిస్తాను, వారు దాన్ని స్వాధీనం చేసుకునే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా చెప్తున్నారు.”


నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను.


అతడు సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని సంగతి చూసే వరకు అతడు అక్కడే ఉంటాడని యెహోవా ప్రకటిస్తున్నారు. ఒకవేళ మీరు బబులోనీయులతో పోరాడితే విజయం సాధించలేరు’ అని చెప్పావు” అన్నాడు.


ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’


“అయితే నేను రాబోయే రోజుల్లో మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.


“అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; ఆయన మీ చెరను పొడిగించరు. కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు.


అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను.


“మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా?


దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.


ఎవరినుండి భయం లేకుండా వారు తమ స్వదేశంలో క్షేమంగా నివసిస్తున్నప్పుడు వారు నాకు చేసిన నమ్మకద్రోహాన్ని, దానివల్ల వారు పొందిన అవమానాన్ని మర్చిపోతారు.


దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది; అది అంతం గురించి మాట్లాడుతుంది అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి; ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆలస్యం కాదు.


నేనిప్పుడు నా ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను. కానీ ముందు ఈ ప్రజలు రాబోయే రోజుల్లో మీ ప్రజలకు ఏమి చేస్తారో చెప్తాను.”


మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు.


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ