Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 38:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు – నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవనులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 నీవు ఈ విధంగా అంటావు, ‘నగరాలకు రక్షణ గోడలు లేకుండా ఉన్న దేశంపై (ఇశ్రాయేలు) నేను దాడిచేస్తాను. వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సురక్షితంగా ఉన్నామని వారనుకుంటున్నారు. నగరాలను రక్షించటానికి వాటిచుట్టూ గోడలే లేవు. వారి ద్వారాలకు తాళాలు లేవు. అసలు ద్వారాలే లేవు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 38:11
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.


‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను. దోపుడుసొమ్మును పంచుకుంటాను; వాటివలన నా ఆశ తీర్చుకుంటాను. నేను నా ఖడ్గాన్ని దూస్తాను నా చేయి వారిని నాశనం చేస్తుంది’ అని శత్రువు అనుకున్నాడు.


“ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది.


చెట్లు తమ పండ్లను ఇస్తాయి, భూమి తన పంటను ఇస్తుంది; ప్రజలు తమ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను వారి కాడిని విరగ్గొట్టి, వారిని బానిసలుగా చేసుకున్న వారి చేతుల్లో నుండి వారిని విడిపించినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.


“మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా?


చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.


సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మిమ్మల్ని ముట్టుకున్న వారు యెహోవా కనుగుడ్డును ముట్టినట్లే అని తలంచి తనకు ఘనత కలిగేలా మహిమాన్వితుడు మిమ్మల్ని దోచుకున్న దేశాల మీదికి నన్ను పంపించారు.


“వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి;


అయితే మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలో స్థిరపడాలి, మీరు క్షేమంగా జీవించేలా ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిస్తారు.


దానీయులు మీకా తయారుచేసుకున్న వాటిని, అతని యాజకుడిని తీసుకుని లాయిషుపై, సమాధాన భద్రతలతో ఉన్న ప్రజలను చేరుకున్నారు. వారిపై ఖడ్గంతో దాడి చేసి, పట్టణాన్ని తగలబెట్టారు.


కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు ప్రయాణిస్తూ లాయిషుకు వచ్చి అక్కడి ప్రజలు సీదోనీయుల్లా సమాధానం భద్రత కలిగి క్షేమంగా జీవించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని వారిని బాధించేవారు ఎవరూ లేరని, వారు వృద్ధి చెందుతున్నారని చూశారు. అంతేకాక వారు సీదోనీయులకు దూరంగా ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా ఉండడం చూశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ