Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 28:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నేను విదేశీయులను, ఇతర రాజ్యాలనుంచి క్రూరులను, నీ మీదికి రప్పిస్తాను. తెలివితో నువ్వు నిర్మించుకున్న నీ అందమైన పట్టణాల మీద వాళ్ళు తమ కత్తులు ఝళిపించి నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను. వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు! వారు తమ కత్తులను దూస్తారు. నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు. వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 28:7
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు అతని వైభవాన్ని అంతం చేశారు అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు.


నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.


“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘బబులోను రాజైన నెబుకద్నెజరుచేత నేను ఈజిప్టువారి అల్లరిమూకలను అంతం చేస్తాను.


ప్రజల్లో అతి క్రూరులైన తన సైన్యాన్ని తీసుకుని ఆ దేశాన్ని నాశనం చెయ్యడానికి అతడు వస్తాడు. వారు ఈజిప్టు వారిపై తమ ఖడ్గాలు దూసి దేశమంతా శవాలతో నింపుతారు.


విదేశీ జాతులలో క్రూరులు దాన్ని నరికి నేల మీద వదిలేశారు. కొండల్లో, లోయల్లో దాని కొమ్మలు పడి ఉన్నాయి; భూమిమీది వాగులన్నిటిలో దాని కొమ్మలు విరిగిపడ్డాయి. భూమి మీద ఉన్న జాతులన్ని దాని నీడ నుండి బయటకు వచ్చి దానిని వదిలేశాయి.


అన్ని జాతులలో అతి క్రూరులైన బల శూరుల ఖడ్గంతో నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను. వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు, దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి.


వారి ఇళ్ళను స్వాధీనం చేసుకోవడానికి ప్రజల్లో అత్యంత దుష్ట జాతులను రప్పిస్తాను. నేను వారి బలవంతుల గర్వాన్ని అణచివేస్తాను వారి పరిశుద్ధాలయాలు అపవిత్రం చేయబడతాయి.


“దాని తర్వాత రాత్రివేళ నా దర్శనంలో నేను చూస్తుండగా నాలుగవ మృగం కనిపించింది. అది భయానకంగా, భయం కలిగించేదిగా, మహా శక్తి కలిగి ఉంది. దానికి పెద్ద ఇనుప పళ్లున్నాయి; అది దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. అంతకుముందు కనిపించిన మృగాల కంటే అది భిన్నమైనది, దానికి పది కొమ్ములున్నాయి.


పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ