Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 24:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఉగ్రతను రేపి ప్రతీకారం తీసుకోవడానికి దాని రక్తం కప్పివేయబడకుండ వట్టి బండ మీద క్రుమ్మరించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 కాబట్టి దాని విషయం కోపాగ్ని రేకెత్తించి ప్రతీకారం తీర్చుకోవాలని, అది చిందించిన రక్తం మట్టితో కప్పకుండా దాన్ని ఆ నున్నటి బండ మీద నేను ఉండనిచ్చాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 నేనామె రక్తాన్ని రాతిబండమీద వుంచాను. అందువల్ల అది కప్పబడదు. చూచిన ప్రజలకు కోపం రావాలని, అమాయక ప్రజలను చంపినందుకు వారామెను శిక్షించాలని నేనది చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఉగ్రతను రేపి ప్రతీకారం తీసుకోవడానికి దాని రక్తం కప్పివేయబడకుండ వట్టి బండ మీద క్రుమ్మరించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 24:8
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకంటే, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన విగ్రహాలన్నిటి బట్టి నాకు కోపం రేపారు, నా కోపం ఈ స్థలంపై రగులుకుంటుంది, అది చల్లారదు.’


ఎందుకంటే ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు, వారు చేతులతో చేసిన వాటన్నిటి బట్టి నాకు కోపం రేపారు. నా కోపం ఈ స్థలంపై కుమ్మరించబడుతుంది, అది చల్లారదు.’


ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు. భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది; భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు.


పిల్లలు కట్టెలు సేకరిస్తారు, తండ్రులు మంట వెలిగిస్తారు, స్త్రీలు పిండిని పిసికి ఆకాశ రాణికి సమర్పించడానికి రొట్టెలు తయారుచేస్తారు. నా కోపాన్ని రెచ్చగొట్టడానికి వారు ఇతర దేవుళ్ళకు పానార్పణలు పోస్తారు.


“ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నా కోపం నా ఉగ్రత ఈ స్థలంపై మనుష్యులపై మృగాలపై పొలాల్లో ఉన్న చెట్లపై మీ భూమి పంటలపై కుమ్మరించబడతాయి; అది కాలిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు.


నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీవు అపరాధివి అయ్యావు, నీవు తయారుచేసిన విగ్రహాల వలన నీవు అపవిత్రం అయ్యావు. నీవే నీ దినాలు దగ్గర పడేలా చేసుకున్నావు, నీ సంవత్సరాలు ముగింపుకు వచ్చాయి. కాబట్టి నేను నిన్ను ఇతర జనాంగాల మధ్య హాస్యాస్పదంగా చేసి, అన్ని దేశాల ఎదుట నవ్వులపాలు చేస్తాను.


వీరిద్దరు వ్యభిచారం చేసి హత్యలు చేశారు కాబట్టి నీతిమంతులైన న్యాయాధిపతులు వీరికి తగిన శిక్ష విధిస్తారు.


“అప్పుడు నా కోపం తీరుతుంది, వారి మీద నా ఉగ్రత తగ్గుతుంది, నా ప్రతీకారం తీరుతుంది. నేను వారి మీద నా ఉగ్రతను పూర్తిగా కుమ్మరించినప్పుడు, యెహోవానైన నేను రోషంతో మాట్లాడానని వారు తెలుసుకుంటారు.


“ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.


మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది.


అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయటపెడతారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.


బిగ్గరగా ఇలా రోదించారు, “ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని, బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ