Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 24:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 మీ తలపాగాలు మీ తలల మీద నుండి తీయరు మీ చెప్పులు మీ కాళ్లకే ఉంటాయి. మీరు దుఃఖించరు ఏడవరు కానీ మీలో మీరే మూల్గుతూ మీ పాపాల కారణంగా క్రుంగిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 మీ శిరో భూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాద రక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 మీ తలపాగాలు మీ తలలపై ఉంటాయి. మీ చెప్పులు మీ కాళ్ళకు ఉంటాయి. మీరు సంతాపపడరు, కన్నీరు కార్చరు. ఒకడినొకరు చూసి మూలుగుతూ, మీరు చేసిన దోషాల కారణంగా క్షీణించిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 మీరు మీ తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 మీ తలపాగాలు మీ తలల మీద నుండి తీయరు మీ చెప్పులు మీ కాళ్లకే ఉంటాయి. మీరు దుఃఖించరు ఏడవరు కానీ మీలో మీరే మూల్గుతూ మీ పాపాల కారణంగా క్రుంగిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 24:23
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు ఒలీవల కొండ ఎక్కుతూ ఏడ్చాడు. తన తల కప్పుకుని, చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్లాడు. అతనితో ఉన్నవారందరు తల కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.


వారికి మిగిలిన వారు తెగులుచేత పాతిపెట్టబడతారు, వారి విధవరాండ్రు వారి కోసం రోదించరు.


కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.


వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు.


ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు.


మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము; పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము. మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు. రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.


రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, “మీర మీ సింహాసనాలు దిగిరండి, ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు మీ తలల నుండి పడిపోతాయి.”


కరువు వారిని దెబ్బతీసింది, పంటలు పండవు. ఈ బాధకు క్షీణించిపోయారు, ఇంతకంటే ఖడ్గం చేత చావడం మహా భాగ్యం అనిపిస్తుంది.


అప్పుడు నేను చేసినట్లే మీరు కూడా చేస్తారు. మీ మీసం గడ్డం కప్పుకోరు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినరు.


“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు, “మా పాపాలు దోషాలు మాకు భారంగా ఉన్నాయి, వాటివలన మేము క్షీణించి పోతున్నాము; మేమెలా బ్రతకాలి?” అని అంటున్నారు.’


ఆహారానికి నీటికి కొరత ఏర్పడుతుంది. వారు ఒకరినొకరు చూసి దిగులుపడతారు, వారి పాపం కారణంగా వారు నశించిపోతారు.


తలకు నార తలపాగా ధరించి నడుముకు నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేదీ ఏదీ వారు ధరించకూడదు.


అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.


శత్రు దేశంలో మీలో మిగిలిన వారు తమ పాపాలను బట్టి కుళ్ళిపోతారు; తమ పూర్వికుల పాపాలను బట్టి కూడా కుళ్ళిపోతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ