Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 18:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అతడు ఎవరినీ అణచివేయడు, ఎవరి వస్తువులు తాకట్టు ఉంచుకోడు. అతడు ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇస్తాడు, దిగంబరికి బట్టలు ఇస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఎవరినీ బాధ పెట్టకుండా, తాకట్టు వస్తువు ఉంచుకోకుండా, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యకుండా, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 ఆ మంచి కుమారుడు ప్రజల మంచితనాన్ని ఉపయోగించు కోకుండా ఉండవచ్చు. ఏ వ్యక్తి అయినా తన వద్దకు అప్పుకోరివస్తే, అతడు వస్తువులు తాకట్టు పెట్టుకొని డబ్బు ఇస్తాడు. మళ్లీ అప్పు తీసుకొన్నవాడు డబ్బు చెల్లిస్తే, ఆ మంచి కుమారుడు తాకట్టు వస్తువులు తిరిగి ఇచ్చివేస్తాడు. మంచి కుమారుడు ఆకలిగొన్న వారికి అన్నం పెడతాడు. అవసరమైన వారికి అతడు వస్త్రదానం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అతడు ఎవరినీ అణచివేయడు, ఎవరి వస్తువులు తాకట్టు ఉంచుకోడు. అతడు ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇస్తాడు, దిగంబరికి బట్టలు ఇస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 18:16
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఏ కారణం లేకుండానే నీ సోదరుల దగ్గర తాకట్టు తీసుకున్నావు; నీవు ప్రజల బట్టలు లాక్కుని, వారిని నగ్నంగా వదిలివేసావు.


సొంత భూమి కలిగి ఉండి, నీవు అధికారంలో ఉండి, ఒక గౌరవం కలిగినవాడవై, స్థాయికి తగినట్టుగా జీవిస్తూ కూడా, నీవు అలసిపోయినవారికి నీళ్లు ఇవ్వలేదు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టకుండ వెనుకకు తీసుకున్నావు.


“ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా,


ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక, కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు,


నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను, అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు,


పేదవారిపై శ్రద్ధచూపువారు ధన్యులు; అలాంటి వారిని యెహోవా కష్ట దినాన విడిపిస్తారు.


ధారాళంగా ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.


నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు.


పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.


పేదవారిని దరిద్రులను అణచివేస్తాడు. దోపిడీలు చేస్తాడు. అప్పుకు తాకట్టుగా తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడు. అతడు విగ్రహాలవైపు చూస్తాడు. అసహ్యమైన పనులు చేస్తాడు.


“అతడు పర్వత క్షేత్రాల దగ్గర తినడు ఇశ్రాయేలీయుల విగ్రహాలను చూడడు. తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు.


ఎవరిని బాధించడు, అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి దిగంబరికి బట్టలు ఇస్తాడు.


ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు.


నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు.


కాబట్టి పేదలకు బహుమతులు ఇవ్వండి అప్పుడు మీకు అంతా శుద్ధిగానే ఉంటుంది.


అయితే నీవు విందును ఏర్పాటు చేసినప్పుడు పేదలను, కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను ఆహ్వానించు,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ