Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 11:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 “వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 కాగా నీవు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆయా జనములమధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలోనుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలుదేశమును మీ వశము చేసెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 కాబట్టి ఇలా చెప్పు “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. నేను ఇతర జనాల మధ్యలో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు చెదిరిపోయిన దేశాలనుండి మిమ్మల్ని నేను సమీకరిస్తాను. మీకు తిరిగి ఇశ్రాయేలు దేశాన్ని ఇస్తాను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 కావున వారి ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేకదేశాలకు చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా దేశాలనుండి తిరిగి తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 “వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 11:17
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక.


అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.


“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా నుండి దూరంగా బబులోనీయుల దేశానికి బందీలుగా పంపిన వారిని నేను ఈ మంచి అంజూర పండ్లలా భావిస్తున్నాను.


వారికి మేలు కలిగేలా వారిపై నా దృష్టి పెడతాను. వారిని మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను. నేను వారిని కడతాను, కూల్చివేయను; నాటుతాను, పెరికివేయను.


నేనే యెహోవానని నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, ఎందుకంటే వారు తమ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగి వస్తారు.


యెహోవా ఇలా అంటున్నారు: “బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.


నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను.


ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.


యెహోవా ఇలా చెప్తున్నారు: “ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీరు పెట్టుకోకుండా నీ కళ్లను అడ్డుకో, ఎందుకంటే నీ పనికి ప్రతిఫలం లభిస్తుంది, వారు శత్రువుల దేశం నుండి తిరిగి వస్తారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి రప్పిస్తాను మీరు చెదిరిపోయి ఉన్న దేశాల నుండి బలమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న ఉగ్రతతో మిమ్మల్ని సమకూరుస్తాను.


ఇతర ప్రజల నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు చెదరిపోయిన ఆయా దేశాల్లో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపంలా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఇతర ప్రజల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధ పరుచుకుంటాను.


మీ పూర్వికులకు ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశమైన ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.


“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ప్రజల్లో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చినప్పుడు వారి ద్వారా నేను ఆ ప్రజల ఎదుట పరిశుద్ధుడనని రుజువవుతాను. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన వారి దేశంలో వారు నివసిస్తారు.


“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను.


నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను.


“ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను.


సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను తూర్పు, పడమర దేశాల నుండి నా ప్రజలను రక్షిస్తాను.


మీ దేవుడైన యెహోవా మీ భాగ్యాలను పునరుద్ధరిస్తారు, మీపై కనికరం చూపించి ఆయన మిమ్మల్ని చెదరగొట్టిన అన్ని దేశాలన్నిటి నుండి మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ