Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 6:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 కుటుంబ వివరాల ప్రకారం లేవీ కుమారుల పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి. (లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు. గెర్షోను, కహాతు, మెరారీ అనువారు లేవీ కుమారులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 కుటుంబ వివరాల ప్రకారం లేవీ కుమారుల పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి. (లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 6:16
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు.


లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.


రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.


యాకోబు ఈజిప్టులో పదిహేడు సంవత్సరాలు జీవించాడు, అతడు జీవించిన సంవత్సరాలు నూట నలభై ఏడు.


యోసేపు నూటపది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. అతని శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచాక, ఈజిప్టులో అతని శరీరాన్ని ఒక శవపేటికలో ఉంచారు.


లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి వంశాల ప్రకారం దావీదు లేవీయులను వేరుచేసి మూడు విభాగాలు చేశాడు.


లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.


లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.


అప్పుడు ఈ లేవీయులు పనికి నియమించబడ్డారు: కహాతీయుల నుండి: అమాశై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయుల నుండి: అబ్దీ కుమారుడైన కీషు, యెహల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయుల నుండి: జిమ్మా కుమారుడైన యోవాహు, యోవాహు కుమారుడైన ఏదెను.


ఆ రోజుల్లో లేవీ గోత్రపు పురుషుడు లేవీ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,


కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. (కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు.)


అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెళ్ళి చేసుకున్నాడు. వారికి అహరోను మోషేలు పుట్టారు. (అమ్రాము 137 సంవత్సరాలు బ్రతికాడు.)


లేవీ మునిమనమడు, కహాతు మనుమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, కొంతమంది రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనులు కొంతమందిని పోగు చేసి,


వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము.


లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి.


గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.


కహాతు వంశస్థుల పేర్లు ఇవి: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.


మెరారి వంశస్థులు: మహలి, మూషి. వీరు వారి వారి కుటుంబాల ప్రకారం లేవీ వంశస్థులు.


లిబ్నీయులు, షిమీయులు వంశస్థులు గెర్షోనుకు చెందినవారు; వీరు గెర్షోను వంశస్థులు.


కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.


గెర్షోను సంతతివారికి ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్థ గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.


షిమ్యోను గోత్రంలో 12,000; లేవీ గోత్రంలో 12,000; ఇశ్శాఖారు గోత్రంలో 12,000;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ