Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 36:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 తర్వాత బెసలేలును ఒహోలీయాబును, యెహోవా సామర్థ్యం ఇచ్చిన వారిని, పని చేయడానికి ప్రేరేపించబడిన వారందరిని మోషే పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరిని మోషే పిలిపించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 బెసలేలు, అహోలీయాబులతో పాటు యెహోవా ఎవరి హృదయాల్లో జ్ఞాన వివేకాలు ఉంచి ఆ పని చేయడానికి ప్రేరేపణ కలిగించాడో వాళ్ళందరినీ మోషే పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 తర్వాత బెసలేలును, అహోలీయాబును, యెహోవా నైపుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను మోషే పిలిచాడు. పనిలో సహాయం చేయాలని వీళ్లంతా వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 తర్వాత బెసలేలును ఒహోలీయాబును, యెహోవా సామర్థ్యం ఇచ్చిన వారిని, పని చేయడానికి ప్రేరేపించబడిన వారందరిని మోషే పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 36:2
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుని ఆలయ సేవ అంతటి కోసం యాజకులు, లేవీయుల విభాగాల ప్రకారం ఏర్పాటయ్యారు. ఈ పనులన్నీ చేయడానికి రకరకాల పనులలో నైపుణ్యం గలవారు మనస్పూర్తిగా నీకు సహాయం చేస్తారు. అధిపతులు, ప్రజలందరూ నీ ప్రతి ఆజ్ఞకు లోబడతారు.”


“నాకు ఒక అర్పణ తీసుకురావాలి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతిఒక్కరి నుండి నీవు నా కోసం కానుక తీసుకోవాలి.


పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే నీవు వాటిని చేసేలా చూడాలి.


అహరోను నాకు యాజకునిగా సేవ చేయడానికి, అతడు ప్రతిష్ఠించబడాలి కాబట్టి అతనికి వస్త్రాలను తయారుచేయమని అలాంటి వాటి విషయాల్లో నేను జ్ఞానాన్ని ఇచ్చిన నైపుణ్యంగల పనివారందరికి చెప్పు.


అంతేకాక అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబును నేను నియమించాను. “నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి నైపుణ్యం కలిగిన పనివారందరికి నేను సామర్థ్యాన్ని ఇచ్చాను:


“మీలో నైపుణ్యం ఉన్నవారు వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన ప్రతిదీ తయారుచేయాలి:


ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి.


పరిశుద్ధాలయం యొక్క సేవ కోసం చేయవలసిన అన్ని రకాల పనులు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యెహోవా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చిన బెసలేలు ఒహోలీయాబు వలె నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం పని చేయాలి” అన్నాడు.


పరిశుద్ధాలయ నిర్మాణానికి ఇశ్రాయేలీయులు తెచ్చిన కానుకలన్నిటిని మోషే దగ్గర నుండి వారు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ప్రతి ఉదయం స్వేచ్ఛార్పణగా అతని దగ్గరకు కానుకలు తెస్తూనే ఉన్నారు.


పౌలు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు.


అర్ఖిప్పుకు చెప్పండి: “ప్రభువు నుండి మీరు పొందిన పరిచర్యను మీరు పూర్తి చేసేటట్లు చూడండి.”


ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ