Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 32:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అతడు ఆ ప్రజలు చేసిన దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాడు; తర్వాత అతడు దానిని పొడిచేసి, నీళ్ల మీద చల్లి, ఆ నీళ్లను ఇశ్రాయేలీయులతో త్రాగించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ప్రజలు తయారు చేసుకున్న ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేశాడు. ఆ పొడిని నీళ్లలో కలిపి ఇశ్రాయేలు ప్రజల చేత తాగించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగించేసాడు. అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేసాడు. ఆ దుమ్మును నీళ్లలో పడేసి ఇశ్రాయేలు ప్రజల చేత బలవంతంగా ఆ నీళ్లు తాగించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అతడు ఆ ప్రజలు చేసిన దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాడు; తర్వాత అతడు దానిని పొడిచేసి, నీళ్ల మీద చల్లి, ఆ నీళ్లను ఇశ్రాయేలీయులతో త్రాగించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 32:20
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు.


బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము కట్టిన పూజా స్థలాన్ని కూడా అతడు పడగొట్టాడు. ఆ క్షేత్రాన్ని కాల్చివేసి పొడి చేశాడు, అషేరా స్తంభాన్ని కూడా కాల్చివేశాడు.


అతడు యెహోవా మందిరం నుండి యెరూషలేము బయట ఉన్న కిద్రోను లోయ దగ్గరకు అషేరా స్తంభాన్ని తెప్పించి, అక్కడ దానిని కాల్చివేశాడు. అతడు దానిని పొడిగా నలుగగొట్టి ఆ పొడిని సాధారణ ప్రజల సమాధుల మీద చల్లాడు.


అతని ఆదేశాల మేరకు ప్రజలు బయలు బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను సూర్యదేవతా విగ్రహాలను అతడు కూలగొట్టించాడు. అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులర్పించినవారి సమాధుల మీద చల్లివేశాడు.


అప్పుడు మోషే అహరోనును, “నీవు వారిని ఇలాంటి ఘోరమైన పాపం చేసేలా నడిపించడానికి ఈ ప్రజలు నిన్ను ఎలా ప్రేరేపించారు?” అని అడిగాడు.


వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.


విశ్వాసభ్రష్టులు తమ క్రియలకు తగిన మూల్యం పొందుతారు, మంచివారు వారి క్రియలకు తగిన బహుమానం పొందుతారు.


మీరు వారి దేవుళ్ళ విగ్రహాలను అగ్నిలో కాల్చివేయాలి. వాటి మీది వెండి బంగారాలను ఆశించి, మీ కోసం తీసుకోకూడదు, లేకపోతే దాని వలన మీరు చిక్కులో పడతారు. మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యము.


మీరు వారికి ఇలా చేయాలి: వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి, వారి విగ్రహాలను అగ్నితో కాల్చివేయండి.


అలాగే మీరు చేసిన పాపిష్ఠి పని, అనగా దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాను. తర్వాత నలగ్గొట్టి దుమ్ము అంత మెత్తగా దానిని పొడిచేసి, ఆ పర్వతం నుండి ప్రవహిస్తున్న వాగులో పడేశాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ