Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 26:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 “గుడారపు ప్రవేశ ద్వారానికి నీలం, ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పనితో ఒక తెర తయారుచేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

36 “తర్వాత గుడారం ద్వారానికి ఒక తెర చెయ్యి. తెర చేయటానికి నీలం, ఊదా, ఎరుపు బట్టను సున్నితమైన బట్టను ఉపయోగించు. ఆ బట్టలో చిత్రపటాలను అల్లిక చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 “గుడారపు ప్రవేశ ద్వారానికి నీలం, ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పనితో ఒక తెర తయారుచేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 26:36
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. గుడారంలో నివసిస్తూ ఒకచోట నుండి మరో చోటికి తిరుగుతున్నాను.


షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.


“నీలం ఊదా ఎరుపు రంగుల్లో పేనిన సన్నని నారతో ఒక తెరను చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించాలి.


“ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో చేసిన ఇరవై మూరల పొడవు గల తెర ఉండాలి. దానికి నాలుగు స్తంభాలు వాటికి నాలుగు దిమ్మలు ఉండాలి.


“నిర్ణయాలు తీసుకోవటానికి హస్త నైపుణ్యంతో కూడిన రొమ్ము పతకం చేయాలి. ఏఫోదును చేసినట్లు దీనిని బంగారం నీలం ఊదా ఎరుపురంగు నూలు పేనిన సన్నని నారతో తయారుచేయాలి.


“సన్నని నారబట్టతో చొక్కా నేయాలి. సన్నని నారబట్టతో తలపాగా తయారుచేయాలి. బుటా పనిగా నడికట్టు చేయాలి.


“అవేమంటే, సమావేశ గుడారం, దాని గుడారం, దాని పైకప్పు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;


ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం; సమావేశ గుడారపు ద్వారానికి తెర;


గుడారపు ప్రవేశ ద్వారానికి వారు నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పని చేసిన తెర తయారుచేశారు.


ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో తెర తయారుచేయబడింది. అది ఇరవై మూరల పొడవు గల తెర, ఆవరణం యొక్క తెరల్లా అయిదు మూరల ఎత్తు ఉంది.


పేనిన సన్నని నారతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో బుటా పనిగా నడికట్టు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.


అప్పుడు వారు సమావేశ గుడారం మోషే దగ్గరకు తెచ్చారు: గుడారం దాని అలంకరణలు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;


నిబంధన మందసం ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి సమావేశ గుడారపు ద్వారానికి తెర తగిలించాలి.


నీకు అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు వేసి, మంచి చర్మంతో చేసిన చెప్పులు నీ పాదాలకు తొడిగించాను. నీకు సన్నని అవిసె నారబట్టలు వేసి ఖరీదైన పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.


గెర్షోనీయులు కాపాడవలసినవి: సమావేశ గుడారం, గుడారం, దాని పైకప్పు, సమావేశ గుడార ద్వారం యొక్క తెర,


నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది.


నేనే ద్వారాన్ని; నా ద్వారా లోపలికి ప్రవేశించేవారు రక్షింపబడతారు. వారు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ పచ్చికను కనుగొంటారు.


అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ