Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 22:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్పగించుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 అతడు నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చును. కాని సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి ఇచ్చివేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 22:26
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఏ కారణం లేకుండానే నీ సోదరుల దగ్గర తాకట్టు తీసుకున్నావు; నీవు ప్రజల బట్టలు లాక్కుని, వారిని నగ్నంగా వదిలివేసావు.


తండ్రిలేనివారి గాడిదను తోలుకుపోతారు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకెళ్తారు.


బట్టలు లేదా, రాత్రంతా దిగంబరంగా గడుపుతారు; చలికి కప్పుకోడానికి వారికి ఏమి లేదు.


దుష్టుడు తండ్రిలేని పిల్లలను రొమ్ము నుండి లాగివేస్తాడు; వారు పేదవారి శిశువును తాకట్టుగా తీసుకుంటారు.


బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు; అవసరతలో ఉన్న వారి మొరను ఆయన ఆలకిస్తారు.


దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు.


యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు.


అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.


ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే, వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు.


అతడు ఎవరినీ అణచివేయడు, ఎవరి వస్తువులు తాకట్టు ఉంచుకోడు. అతడు ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇస్తాడు, దిగంబరికి బట్టలు ఇస్తాడు.


ఎవరిని బాధించడు, అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి దిగంబరికి బట్టలు ఇస్తాడు.


వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు.


తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు.


న్యాయం విషయంలో విదేశీయులను గాని తండ్రిలేనివారిని గాని వంచించకండి లేదా విధవరాలి యొక్క వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకండి,


అప్పు కోసం పూచీకత్తుగా ఒక తిరగలిని గాని, తిరగలి పై రాతిని గాని తాకట్టు పెట్టకూడదు. ఎందుకంటే అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్లవుతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ