Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నిర్గమ 2:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత, ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వంలో మూల్గుతూ మొరపెట్టారు, తమ బానిస చాకిరీని బట్టి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 చాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చనిపోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతరమైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత, ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వంలో మూల్గుతూ మొరపెట్టారు, తమ బానిస చాకిరీని బట్టి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నిర్గమ 2:23
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు.


అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది.


“మా పూర్వికులు ఈజిప్టులో శ్రమపడడం మీరు చూశారు; ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నారు.


“ఒత్తిళ్ళ భారాన్ని బట్టి ప్రజలు ఆక్రందన చేస్తారు; బలవంతుల చేతి నుండి విడుదల కోసం విన్నవించుకొంటారు.


యెహోవా, నా ప్రార్థన వినండి; సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.


నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. మీ చెవి నా వైపు త్రిప్పండి; నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.


“దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.


నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.


మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.


తర్వాత యెహోవా మిద్యానులో మోషేతో, “నిన్ను చంపడానికి చూసినవారందరు చనిపోయారు కాబట్టి నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లు” అన్నారు.


అంతేకాక, ఈజిప్టు వారిచేత బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలీయుల మూలుగును నేను విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను.


మోషే ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేశాడు, కాని వారి కఠినమైన శ్రమను బట్టి, నిరుత్సాహాన్ని బట్టి వారు అతని మాట వినలేదు.


వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు అహరోనుకు 83 సంవత్సరాలు.


అది ఈజిప్టు దేశంలో సైన్యాల యెహోవాకు సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవారిని గురించి వారు దేవునికి మొరపెట్టగా, ఆయన వారిని కాపాడడానికి రక్షకుడిని విమోచకుడిని పంపుతారు, అతడు వారిని రక్షిస్తాడు.


ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.


అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు. “ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది.


“నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో ఒక మండుతున్న పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు.


ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు.


చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి.


అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.


“యాకోబు ఈజిప్టుకు వచ్చిన తర్వాత, వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా యెహోవా మోషే అహరోనులను పంపారు. వారు మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి ఈ స్థలంలో స్థిరపరిచారు.


“రేపు ఈ సమయానికి బెన్యామీను ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తాను. అతన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా అభిషేకించు; నా ప్రజల మొర నాకు విని వారివైపు చూశాను. అతడే వారిని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు” అని చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ