ఎస్తేరు 8:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 రాజు పేరిట వ్రాయబడి అతని ఉంగరంతో ముద్ర వేసిన ఏ తాకీదు రద్దు చేయబడదు. కాబట్టి మీకు నచ్చినట్లు యూదుల పక్షాన రాజు పేరిట మరొక శాసనాన్ని వ్రాసి రాజముద్ర వేయండి.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింప బడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అయితే రాజు పేరున రాసి రాజ ముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజ ముద్రికతో ముద్రించండి.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రికతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయబడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రాన్ని రద్దుచేయ సాధ్యం కాదు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 రాజు పేరిట వ్రాయబడి అతని ఉంగరంతో ముద్ర వేసిన ఏ తాకీదు రద్దు చేయబడదు. కాబట్టి మీకు నచ్చినట్లు యూదుల పక్షాన రాజు పేరిట మరొక శాసనాన్ని వ్రాసి రాజముద్ర వేయండి.” အခန်းကိုကြည့်ပါ။ |
తర్వాత మొదటి నెల పదమూడవ రోజున రాజ కార్యదర్శులను పిలిపించారు. వారు హామాను ఆజ్ఞలన్నిటిని రాజు సంస్థానాధిపతులకు, సంస్థానాధికారులకు, ఆ సంస్థానాల్లోని ప్రజల అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిలో వారి భాషలో వ్రాసి పంపాలని ఆజ్ఞాపించారు. వాటిని రాజైన అహష్వేరోషు పేరిట వ్రాసి వాటిపై రాజు ఉంగరంతో ముద్ర వేశారు.