Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎఫెసీయులకు 4:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

19 వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎఫెసీయులకు 4:19
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇక చెడును నీటిలా త్రాగే నీచులు, అవినీతిపరులు, ఆయన దృష్టికి ఇంకెంత అల్పులు!


వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు. ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు. వారు వివేచనలేని కాపరులుగా ఉన్నారు; వారందరు తమకిష్టమైన దారుల్లో పోతారు, తమ సొంత ప్రయోజనం చూసుకుంటారు.


వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి.


కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.


కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి.


కాలుతున్న ఇనుము చేత కాల్చబడిన మనస్సాక్షి కలిగిన వంచకులైన అబద్ధికుల నుండి అలాంటి బోధలు వస్తాయి.


ఎందుకంటే, మీరు గతకాలంలో దేవుని ఎరుగనివారిగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు.


“కుక్క తను కక్కిన దానికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు” అనే సామెతలు వీరి విషయంలో నిజం.


వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడం వలన నాశనం చేయబడ్డారు.


ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ