Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రసంగి 7:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 సుగంధతైలముకంటె మంచిపేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం కంటె మరణ దినం మేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రసంగి 7:1
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.


అది అహరోను తలమీద పోయబడి అతని గడ్డం మీదుగా కారుతూ, వస్త్రపు అంచు వరకు కారిన ప్రశస్తమైన తైలం వంటిది.


సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి వార్త ఎముకలకు బలాన్నిస్తుంది.


గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.


అది వినినవాడు నిన్ను అవమానపరచవచ్చు, అప్పుడు నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.


అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి, స్నేహితుని వల్ల కలిగే వినోదం వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది.


పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు, కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది.


ఇంకా జీవించి ఉన్నవారి కంటే మునుపే చనిపోయినవారు, సంతోషంగా ఉన్నారని నేను అనుకున్నాను.


ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు.


మీ పరిమళ ద్రవ్యాల సువాసన హృదయానికి ఆనందాన్నిస్తుంది; మీ పేరు పోయబడిన పరిమళం లాంటిది. కాబట్టి యువతులు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు!


నా సోదరీ, నా వధువా, నీ ప్రేమ ఎంత ఆహ్లాదకరం! ద్రాక్షరసం కంటే నీ ప్రేమ ఆనందమయం, నీవు పూసుకున్న పరిమళ తైల సువాసన సుగంధ ద్రవ్యాలన్నిటినీ మించింది!


నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.


యెహోవా, బ్రతకడం కంటే నాకు చావడం మేలు, కాబట్టి నా ప్రాణాన్ని తీసివేయండి.”


అయినా కానీ, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి, కాని మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పారు.


వారు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు, అప్పటికే యేసును అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది ప్రేరేపించాడు.


మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.


కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర నివసించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము.


దీనిని బట్టి పూర్వికులు మెప్పుపొందారు.


వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు,


అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.


కాబట్టి ఆమె ఉదయం వరకు అతని పాదాల దగ్గర పడుకుని, ఇంకా ఒకనిని ఒకరు గుర్తుపట్టేటంత వెలుగు రాకముందే లేచింది; “ఒక స్త్రీ నూర్పిడి కళ్ళం లోనికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు” అని బోయజు అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ