Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రసంగి 11:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీకు గాలి వీచే దిశ తెలియనట్లుగానే, తల్లి గర్భంలో పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియనట్లుగా, అన్నిటిని చేసినవాడైన దేవుని క్రియలు మీకు అర్థం కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 చూలాలి గర్భమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీకు గాలి వీచే దిశ తెలియనట్లుగానే, తల్లి గర్భంలో పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియనట్లుగా, అన్నిటిని చేసినవాడైన దేవుని క్రియలు మీకు అర్థం కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రసంగి 11:5
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

సర్వశక్తిమంతుడు మనకు మించినవాడు శక్తిలో ఉన్నతమైనవాడు; తన న్యాయం గొప్ప నీతిని బట్టి, ఆయన అణచివేయడు.


“నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.


పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.


యెహోవా! మీ కార్యాలు ఎన్నో! మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది.


యెహోవా నా దేవా, మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ప్రణాళికలు వేశారు. మీతో పోల్చదగిన వారు లేరు; మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించినవి.


యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి, మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి!


ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు!


గాలి దక్షిణం వైపు వీస్తూ అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది; అది సుడులు సుడులుగా తిరుగుతూ, తన దారిలోనే తిరిగి వస్తుంది.


గాలిని పరిశీలించేవాడు విత్తనాలు చల్లడు; మబ్బులు చూస్తూ ఉండేవాడు పంట కోయడు.


మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను.


ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు.


జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు?


దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యుని క్రింద ఏమి జరుగుతుందో ఎవరూ అర్థం చేసుకోలేరు. దీన్ని వెదకడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దాని పూర్తిగా గ్రహించలేరు. జ్ఞానులు తమకు తెలుసు అని వాదించినప్పటికీ, వారు దానిని నిజంగా గ్రహించలేరని నేను తెలుసుకున్నాను.


నీకు తెలియదా? నీవు వినలేదా? భూమి అంచులను సృష్టించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు, ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.


గాలి తనకు ఇష్టమైన చోట వీస్తుంది, దాని శబ్దం వినగలవు కానీ అది ఎక్కడ నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో చెప్పలేవు. అలాగే ఆత్మ మూలంగా జన్మించినవారు కూడా అంతే” అన్నారు.


ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది! ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి, ఆయన మార్గాలు మన ఊహకు అందనివి!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ