Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 7:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 కాబట్టి మీ దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకోండి; ఆయన నమ్మదగిన దేవుడు, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయన వెయ్యి తరాల వరకు తన నిబంధన స్థిరపరిచేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 “అందుచేత మీ దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన నమ్మదగినవాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన తన ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారందరికీ ఆయన తన ప్రేమ, దయ చూపుతాడు. వేయి తరాలవరకు ఆయన తన ప్రేమ, దయ చూపిస్తూనే ఉంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 కాబట్టి మీ దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకోండి; ఆయన నమ్మదగిన దేవుడు, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయన వెయ్యి తరాల వరకు తన నిబంధన స్థిరపరిచేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 7:9
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.


నేను నీతో ఉంటాను, నీవు వెళ్లే ప్రతీ చోట నిన్ను సంరక్షిస్తాను, ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను. నేను నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నిన్ను విడువను.”


అప్పుడు నేను నాకును మీకును, ప్రతి రకమైన ప్రాణులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక ఎన్నడు కూడా సమస్త జీవులన్నిటిని నాశనం చేయడానికి నీరు వరదలా మారదు.


ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.


ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు.


అతడు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.


నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,


“మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు.


ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.


ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు,


యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు.


ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.


మీ నీతి దేవుని ఉన్నత పర్వతాల్లా, మీ న్యాయం అగాధ సముద్రంలా ఉన్నాయి. యెహోవా! మీరు మనుష్యులను జంతువులను సంరక్షిస్తున్నారు.


అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.


రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన పాలకుల సేవకునితో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవా నమ్మకమైనవాడు కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు, యువరాజులు చూసి నమస్కారం చేస్తారు.”


మీరు వేలమందిపై ప్రేమ చూపిస్తారు కానీ తల్లిదండ్రుల పాపాల శిక్షను వారి తర్వాత వారి పిల్లల ఒడిలోకి తీసుకువస్తారు. ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సైన్యాల యెహోవా.


ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.


నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా,


‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’


దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు.


తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.


వారందరు ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు.


అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు.


అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మా వర్తమానం “అవునని” చెప్పి “కాదు” అనేలా ఉండదు.


“చూడండి, నేనే ఏకైక దేవున్ని! నేను తప్ప మరో దేవుడు లేడు చంపేవాడను నేనే బ్రతికించేవాడను నేనే. గాయం చేసేది నేనే, బాగు చేసేది నేనే, నా చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు.


ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.


యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఎవరు లేరని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపబడ్డాయి.


కాబట్టి పైనున్న పరలోకంలో గాని, క్రిందున్న భూమిమీద గాని, యెహోవాయే దేవుడని, మరొక దేవుడు లేడని ఈ రోజే మీరు గుర్తించి, మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి.


అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.


మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు.


అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.


మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.


ఈ సత్యం వారికి అబద్ధమాడని దేవుడు యుగయుగాలకు ముందే వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని గురించిన నిరీక్షణతో,


వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.


వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని శారా నమ్మింది కాబట్టి శారాకు పిల్లలను కనే వయస్సు దాటిపోయినా, విశ్వాసం ద్వారానే ఆమె బిడ్డను కనగలిగింది.


దేవుడు అబద్ధమాడడం అసాధ్యమైన రెండు మార్పులేని విషయాల ద్వారా, మన ముందు ఉంచిన నిరీక్షణను పట్టుకోవడానికి పరుగెత్తిన మనల్ని ఎంతో ప్రోత్సహించగలిగేలా, దేవుడు ఇలా చేశారు.


శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.


ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు.


యెహోవా దూత గిల్గాలు నుండి వెళ్లి బోకీముకు వెళ్లి ఇలా అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చి మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపించాను. ‘నేను మీతో చేసిన నా ఒడంబడికను ఎన్నడు మీరను,


“యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి! అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.” తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ