Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 7:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మీరు ఈ చట్టాలను శ్రద్ధగా విని వాటిని జాగ్రత్తగా అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా, మీతో తన ప్రేమ నిబంధనను కొనసాగిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 “మీరు ఈ ఆజ్ఞలను ఆలకించి, వాటికి జాగ్రత్తగా విధేయులైతే, మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ప్రేమ ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. మీ పూర్వీకులకు ఆయన యిది వాగ్దానం చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మీరు ఈ చట్టాలను శ్రద్ధగా విని వాటిని జాగ్రత్తగా అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా, మీతో తన ప్రేమ నిబంధనను కొనసాగిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 7:12
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.


నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,


“మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు.


ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.


ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.


అప్పుడు నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను’ అని వారితో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాను.” నేను, “ఆమేన్, యెహోవా” అని జవాబిచ్చాను.


నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా,


మీరు పూర్వకాలంలో మా పూర్వికులకు ప్రమాణం చేసిన విధంగా యాకోబు పట్ల నమ్మకత్వాన్ని, అబ్రాహాము పట్ల మారని ప్రేమ చూపుతారు.


చూడండి, ఈ దేశాన్ని నేను మీకిచ్చాను. కాబట్టి మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”


కాబట్టి ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలకు నమ్మకంగా లోబడితే, మీరు మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి.


అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.


కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను జాగ్రత్తగా అనుసరించండి.


కాబట్టి మీ దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకోండి; ఆయన నమ్మదగిన దేవుడు, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయన వెయ్యి తరాల వరకు తన నిబంధన స్థిరపరిచేవారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ