Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 6:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూ ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 6:7
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”


వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా?


మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరిస్తాను.


రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను,


“యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక; యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని బాటసారులు అనకుందురు గాక.


నీతిమంతుల నోరు జ్ఞానాన్ని పలుకుతుంది, వారి నాలుక న్యాయమైనది మాట్లాడుతుంది.


దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు, ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను.


నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు.


జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది, బుద్ధిహీనుని నోరు మూర్ఖత్వాన్ని కుమ్మరిస్తుంది.


జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల హృదయం నిలకడయైనది కాదు.


నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి; నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి. నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.


నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; తల్లిదండ్రులు తమ పిల్లలకు మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు.


అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు కలిగినవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా విన్నారు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన పేరును గౌరవించే వారి విషయం ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడింది.


మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు.


మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.


మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.


తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి.


వాటిని మీ పిల్లలకు నేర్పించండి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి.


మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు.


మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, అందరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.


మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి.


యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక.”


అప్పుడే బోయజు బేత్లెహేము నుండి వచ్చి, “యెహోవా మీకు తోడై ఉండును గాక!” అని పనివారితో అన్నాడు. “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అని వారు జవాబిచ్చారు.


అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ