Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 34:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అంతకుముందే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కాబట్టి అతడు జ్ఞానాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువమీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నూను కొడుకు యెహోషువ, జ్ఞానం కలిగిన ఆత్మతో నిండి ఉన్నాడు. ఎందుకంటే మోషే తన చేతులు అతని మీద ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని మాట విని, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అంతకుముందే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కాబట్టి అతడు జ్ఞానాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 34:9
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు అడిగింది నేను ఇస్తాను. నేను నీకు జ్ఞానం కలిగిన వివేచన హృదయాన్ని ఇస్తాను. నీలాంటి వారు నీకంటే ముందు ఎవరూ లేరు, నీ తర్వాత ఎవరూ ఉండరు.


కాబట్టి మీ ప్రజలను పాలించడానికి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి. ఎందుకంటే, మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”


దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.


వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, “నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు.”


కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు.


యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన విధంగానే ఇశ్రాయేలీయులు చేశారు.


అహరోను నాకు యాజకునిగా సేవ చేయడానికి, అతడు ప్రతిష్ఠించబడాలి కాబట్టి అతనికి వస్త్రాలను తయారుచేయమని అలాంటి వాటి విషయాల్లో నేను జ్ఞానాన్ని ఇచ్చిన నైపుణ్యంగల పనివారందరికి చెప్పు.


నేను అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో అన్ని రకాల నైపుణ్యతలతో నింపాను.


యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, అతని మీద ఉంటుంది.


అయితే దానియేలు తనకున్న గొప్ప లక్షణాలను బట్టి అధిపతులకంటే, నిర్వాహకులకంటే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి రాజు తన రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని అనుకున్నాడు.


నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు.


ఎందుకంటే దేవుడు పరిమితి లేకుండా ఆత్మను అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు పంపినవాడు దేవుని మాటలనే మాట్లాడతాడు.


వారిని అపొస్తలుల ముందు నిలబెట్టినప్పుడు, వారు వీరిపై చేతులుంచి ప్రార్థన చేశారు.


సంతాప దినాల సమయం పూర్తి అయ్యేవరకు ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల్లో మోషే కోసం ముప్పై రోజులు దుఃఖించారు.


బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి.


సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహించబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.


ఎవరిపైనా చేతులను ఉంచడానికి తొందరపడకు, ఇతరుల పాపంలో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకో.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ