Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 3:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 “ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 ఆకాశమందేగాని భూమి యందేగాని నీవుచేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

24 ‘యెహోవా, నా ప్రభువా నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన విషయాలలో కొద్ది భాగం మాత్రమే నీవు నాకు చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంతమైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో గాని భూమి మీదగాని లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 “ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 3:24
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.


మీ గొప్ప నామం గురించి మీ బలమైన బాహువును గురించి వారు విని, వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,


అతడు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.


“మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు.


యెహోవా యొక్క గొప్ప కార్యాలను ఎవరు ప్రచురించగలరు? ఆయన స్తుతిని సంపూర్ణంగా ఎవరు ప్రకటిస్తారు?


యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు; ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.


వారు మీ అద్భుత కార్యాల శక్తి గురించి చెపుతారు, నేను మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను.


ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.


“యెహోవా, నిన్ను పోలినవారెవరు? బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు, దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు” అని నా శక్తి అంతటితో నేను అంటాను.


దేవా, మీ నీతి ఎత్తయిన ఆకాశాలకు ఉన్నతమైనది, మీరు గొప్ప వాటిని చేశారు. దేవా, మీలాంటి వారెవరు?


ప్రభువా, దేవుళ్ళలో మీవంటి వారు లేరు; మీ క్రియలకు ఏది సాటిలేదు.


అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు? దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు?


సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు? యెహోవా మీరు మహా బలాఢ్యులు, మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.


యెహోవా, దేవుళ్ళ మధ్యలో మీవంటి వారెవరు? పరిశుద్ధతలో ఘనమైనవారు మహిమలో భీకరమైనవారు, అద్భుతాలు చేసే మీవంటి వారెవరు?


అందుకు ఫరో, “రేపే” అన్నాడు. అందుకు మోషే అన్నాడు, “మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా నీవన్నట్టే జరుగుతుంది.


లేకపోతే భూమి అంతటి మీద నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా ఈసారి నేను నీ అధికారుల పైకి నీ ప్రజలమీదికి నా తెగుళ్ళ యొక్క పూర్తి శక్తిని పంపుతాను.


కాబట్టి మీరు ఎవరితో దేవుని పోలుస్తారు? ఏ రూపంతో ఆయనను పోలుస్తారు?


“నన్ను ఎవరితో పోలుస్తారు? నాకు సమానులెవరు?” అని పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నారు.


యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది.


కాబట్టి ఏ దేశ ప్రజలైనా గాని, ఏ భాష ప్రజలైనా గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుని దూషిస్తే వారు ముక్కలు చేయబడతారని, వారి ఇల్లు కూల్చివేయబడుతుందని ఆదేశిస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా మరి ఏ దేవుడు రక్షించలేడు.”


యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. ఇప్పుడు యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’


మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని;


ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను:


నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ