Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 26:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిం చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 ఆయన సృజించిన అన్ని జాతుల ప్రజలందరి కంటే మీకు కీర్తి, ఘనత, పేరు కలిగేలా మిమ్మల్ని హెచ్చిస్తానని యెహోవా ఈనాడు ప్రకటించాడు. ఆయన చెప్పినట్టుగా మీరు మీ యెహోవా దేవునికి పవిత్ర ప్రజగా ఉంటారనీ ప్రకటించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 యెహోవా తాను చేసిన రాజ్యాలన్నింటికంటె మిమ్మల్ని గొప్పవాళ్లనుగా చేస్తాడు. మెప్పు, కీర్తి, ఘనత ఆయన మీకు ఇస్తాడు. మరియు ఆయన వాగ్దానం చేసినట్టు మీరు ఆయన స్వంత ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 26:19
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు, అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి. యెహోవాను స్తుతించండి.


మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా,


మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు.


వారు పరిశుద్ధ ప్రజలని, యెహోవా విడిపించినవారని పిలువబడతారు; నీవు అందరికి కావలసిన దానివని పాడుబడని పట్టణమని పిలువబడతావు.


నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది, వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు; ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు, విపత్తు వారి మీదికి వస్తుంది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


అప్పుడు నేను వారి కోసం చేయబోతున్న మంచి పనులన్నిటి గురించి విన్న భూప్రజలందరి ముందు ఈ పట్టణం నాకు కీర్తిని ఆనందాన్ని గౌరవాన్ని తెస్తుంది. నేను వారికి ఇచ్చే విస్తారమైన వృద్ధిని సమాధానాన్ని చూసి వారు భయంతో వణికిపోతారు.’


ఆ సమయంలో నిన్ను హింసించిన వారందరిని నేను శిక్షిస్తాను. కుంటివారిని నేను రక్షిస్తాను; చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. వారు అవమానానికి గురైన ప్రతి దేశంలో నేను వారికి కీర్తిని, ఘనతను ఇస్తాను.


ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను; ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తాను. నేను మిమ్మల్ని చెరలో నుండి తిరిగి తీసుకువచ్చినప్పుడు భూమ్మీద ఉన్న ప్రజలందరిలో నేను మీకు కీర్తిని, ఘనతను ఇస్తాను” అని యెహోవా అంటున్నారు.


యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.”


మోషే, ఇశ్రాయేలు పెద్దలు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని మీరు పాటించాలి.


మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటూ, నేను ఈ రోజు మీకిచ్చే ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త దేశాల కంటే పైగా మిమ్మల్ని హెచ్చిస్తారు.


యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు.


మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు.


ఎందుకంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలు. ఈ భూమి మీద ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా, విలువైన ఆస్తిగా ఎన్నుకున్నారు.


మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ