Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 23:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఎలాగైతేనేం, మీ దేవుడైన యెహోవా బిలాము మాటలను ఆమోదించ లేదు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే శాపాన్ని దీవెనగా మార్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 అయితే యెహోవా దేవుడు బిలాము మాట వినకుండా నిరాకరించాడు. శాపాన్ని మీకు ఆశీర్వాదంగా యెహోవా మార్చాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఎలాగైతేనేం, మీ దేవుడైన యెహోవా బిలాము మాటలను ఆమోదించ లేదు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే శాపాన్ని దీవెనగా మార్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 23:5
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా నా బాధ చూసి, ఈ రోజు ఇతడు పలికిన శాపాలకు బదులుగా నాకు మంచి చేస్తాడేమో!” అని అన్నాడు.


ఎందుకంటే వారు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆహారం గాని నీరు గాని తీసుకెళ్లి ఇవ్వలేదు పైగా వారిని శపించడానికి బిలామును నియమించుకున్నారు. అయితే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారు.


ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు దేవుడు ఖచ్చితంగా మంచివాడు.


ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, కారణం లేని శాపం కూడా నిలువదు.


గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను.


“ ‘తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి, నీవు ప్రేమకు తగిన వయస్సులో ఉన్నావు కాబట్టి నా వస్త్రాన్ని నీపై వేసి నీ నగ్న శరీరాన్ని కప్పాను. నేను నీతో ప్రమాణం చేసి నిబంధన చేసుకున్నప్పుడు నీవు నా దానివి అయ్యావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఎలా జవాబిచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నీతి క్రియలు మీరు గ్రహించేలా షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన మీ ప్రయాణం జ్ఞాపకం చేసుకోండి.”


యెహోవా ఇలా అంటున్నారు, “నేను మిమ్మల్ని ప్రేమించాను.” “కాని మీరు, ‘నీవెలా మమ్మల్ని ప్రేమించావు?’ అని అడుగుతున్నారు. “ఏశావు యాకోబుకు అన్న కాడా? అయినా నేను యాకోబును ప్రేమించాను.


యెహోవా దూత బిలాముతో, “వారితో వెళ్లు కానీ నేను చెప్పేదే నీవు పలకాలి” అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్లాడు.


యూఫ్రటీసు నదికి సమీపంలో ఉన్న పెతోరు దగ్గర ఉన్న బెయోరు కుమారుడైన బిలామును తన స్వదేశంలో పిలువడానికి దూతలను పంపాడు. బాలాకు అన్నాడు: “ఈజిప్టు నుండి ప్రజలు వచ్చారు; వారు భూ ముఖాన్ని కప్పి, నా ప్రక్కన స్థిరపడ్డారు.


సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!”


సువార్తకు సంబంధించినంత వరకు మిమ్మల్ని బట్టి వారు శత్రువులుగా ఉన్నారు, కాని ఎన్నికకు సంబంధించినంత వరకు వారు పితరులను బట్టి ప్రేమించబడినవారు.


అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు?


“నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది.


మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.


శేయీరులో నివసించే ఏశావు సంతతివారు ఆరులో మోయాబీయులు మాకు చేసినట్టే మా దేవుడైన యెహోవా మాకు ఇస్తున్న దేశానికి వెళ్లడానికి కాలినడకన యొర్దాను దాటి వెళ్లనివ్వండి” అని తెలియజేశాను.


నిజంగా ఆయన తన జనులను ప్రేమిస్తున్నారు; పరిశుద్ధులందరు మీ చేతిలో ఉన్నారు. వారు మీ పాదాల దగ్గర వంగి, మీ నుండి ఉపదేశాన్ని పొందుకుంటారు,


ఆయన మీ పూర్వికులను ప్రేమించి వారి సంతతిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, మీకంటే బలమైన గొప్ప దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి, ఈ రోజు ఇస్తున్నట్లుగా వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన తన సన్నిధితో, తన మహాబలంతో మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.


అయితే నేను బిలాము మాట వినలేదు కాబట్టి అతడు మిమ్మల్ని పదే పదే ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ