Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 21:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 లేవీయ యాజకులు ముందుకు సాగాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని పరిచర్య కోసం, యెహోవా పేరిట ఆశీర్వాదాలు పలకడానికి, వివాదాలు దాడులకు సంబంధించిన అన్ని దావాలను నిర్ణయించడానికి వారిని ఎన్నుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 తరువాత యాజకులైన లేవీయులు దగ్గరికి రావాలి. యెహోవాను సేవించి యెహోవా పేరుతో దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కనుక వారి నోటి మాటతో ప్రతి వివాదాన్ని, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యాన్ని పరిష్కరించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 లేవీ సంతతివారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహోవాను సేవించేందుకు, ఆయన పేరిట ప్రజలను దీవించేందుకు మీ దేవుడైన యెహోవా ఈ యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో యాజకులే నిర్ణయిస్తారు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 లేవీయ యాజకులు ముందుకు సాగాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని పరిచర్య కోసం, యెహోవా పేరిట ఆశీర్వాదాలు పలకడానికి, వివాదాలు దాడులకు సంబంధించిన అన్ని దావాలను నిర్ణయించడానికి వారిని ఎన్నుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 21:5
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

అమ్రాము కుమారులు: అహరోను, మోషే. అహరోను, అతని వారసులు నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిలో బలులు అర్పించడానికి, ఆయన సన్నిధిలో సేవ చేయడానికి, ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించడానికి ప్రత్యేకించబడ్డారు.


పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు.


అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది.


“ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.


తర్వాత అహరోను ప్రజల వైపు చేతులెత్తి వారిని దీవించాడు. పాపపరిహారబలి, దహనబలి, సమాధానబలి అర్పించిన తర్వాత బలిపీఠం నుండి దిగివచ్చాడు.


“యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.


నేటి వరకు చేస్తున్నట్లుగా, యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవ చేయడానికి, ఆయన పేరిట ఆశీర్వచనం పలకడానికి లేవీ గోత్రికులను ఆ సమయంలో యెహోవా ప్రత్యేకించుకున్నారు.


యెహోవా పేర నిలిచి ఎల్లప్పుడు సేవ చేయటానికి అతని గోత్రాలన్నిటిలో అతన్ని అతని సంతానాన్ని మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్నాడు.


ఆ వివాదంలో ఉన్న ఇద్దరూ యెహోవా ఎదుట అంటే ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.


దానిని ప్రవహించే ప్రవాహం ఉండి, ఎన్నడు దున్నబడని నాటబడని లోయ దగ్గరకు తోలుకుపోవాలి. అక్కడ ఆ లోయలో పట్టణ పెద్దలు దూడ మెడను విరిచివేయాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ