Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 16:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, అధికారులను మీరు నియమించాలి, వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమునుబట్టి జనులకు తీర్పుతీర్చవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 మీ యెహోవా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులనూ నాయకులనూ నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పుతీర్చాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ వంశాలలో న్యాయమూర్తులను, అధికారులను మీరు నియమించాలి. ఈ న్యాయమూర్తులు, అధికారులు న్యాయంగా సక్రమంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, అధికారులను మీరు నియమించాలి, వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 16:18
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు, “వీరిలో ఇరవైనాలుగు వేలమంది యెహోవా ఆలయ పని బాధ్యత తీసుకోవాలి, ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా ఉండాలి.


ఇస్హారీయుల నుండి: కెనన్యా అతని కుమారులు మందిరపు బయటి పనులు చేయడానికి ఇశ్రాయేలీయులకు అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించబడ్డారు.


ఎజ్రా! నీవు నీకున్న నీ దేవుని జ్ఞానంతో, యూఫ్రటీసు నది అవతలి ప్రజలకు న్యాయం తీర్చడానికి, నీ దేవుని న్యాయవిధులు తెలిసినవారిని నీవే అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించు. అవి తెలియని వారికి నీవు వాటిని బోధించాలి.


దేవునికి భయపడే, అన్యాయపు లాభాన్ని అసహ్యించుకునే, నమ్మదగిన సామర్థ్యం కలిగిన పురుషులను ప్రజలందరిలో నుండి ఎంపికచేయాలి. తర్వాత వారిని వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాలి.


“ఒకవేళ ప్రజలు పోట్లాడుకుంటూ గర్భవతియైన స్త్రీని కొట్టినప్పుడు ఆమె అకాల జన్మనిస్తే ఆమెకు గర్భస్రావమై మరి ఏ ఇతర గాయాలు కాకపోతే, దానికి కారణమైనవాడు ఆమె భర్త అడిగిన నష్టపరిహారాన్ని న్యాయాధిపతులు నిర్ణయించిన ప్రకారం చెల్లించాలి.


వాని యజమాని వానిని దేవుని ఎదుటకు తీసుకురావాలి. వాని యజమాని వానిని తలుపు దగ్గరకు గాని ద్వారబంధం దగ్గరకు గాని తీసుకెళ్లి వాని చెవిని కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు వాని యజమానికి జీవితకాల దాసునిగా ఉంటాడు.


ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.


“ ‘మీరు హత్య చేయకూడదు. ఎవరైనా హత్య చేస్తే, వారు శిక్షకు గురవుతారు’ అని మీ పూర్వికులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా.


కాని నేను చెప్పేదేంటంటే, తన సహోదరుని మీద కాని సహోదరి మీద కాని కోప్పడేవారు తీర్పుకు గురవుతారు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవారు న్యాయస్థానం ఎదుట నిలబడాలి. ‘వెర్రివాడ లేదా వెర్రిదాన!’ అనే వారికి నరకాగ్నికి తప్పదు.


మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రకారం మీలో ప్రతి ఒకరు తమ శక్తి కొద్ది కానుకలు తీసుకురావాలి.


న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.


న్యాయమూర్తి పట్ల గాని మీ దేవుడైన యెహోవాకు సేవచేసే యాజకుని పట్ల గాని ఎవరైనా ధిక్కారం ప్రదర్శిస్తే, వారికి మరణశిక్ష విధించబడాలి. మీరు ఈ దుర్మార్గాన్ని ఇశ్రాయేలు నుండి తొలగించాలి.


లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు.


మీ పెద్దలు, న్యాయాధిపతులు బయటకు వెళ్లి మృతదేహం నుండి దగ్గరలో ఉన్న పట్టణాలకు దూరం కొలుస్తారు.


ప్రజలకు వివాదం ఉన్నప్పుడు, వారు దానిని న్యాయస్థానానికి తీసుకెళ్లాలి, న్యాయాధిపతులు నిర్దోషులను విముక్తులుగా ప్రకటిస్తూ, దోషులను దోషులుగా ప్రకటిస్తారు.


సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ