Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 15:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 “ఏడవ సంవత్సరం అంటే అప్పులు రద్దుచేసే సంవత్సరం దగ్గర్లో ఉందని చెప్పి ఎవరికైనా అప్పు ఇచ్చేందుకు ఎన్నడూ తిరస్కరించవద్దు. అలాంటి చెడుతలంపు మీ మనసులో కలుగనియ్యవద్దు. సహాయం కావాల్సిన ఆ వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడూ చెడుగా తలంచవద్దు. నీవు అతనికి సహాయం చేసేందుకు నిరాకరించకూడదు. ఆ పేదవానికి నీవు ఏమీ ఇవ్వకపోతే అతడు నీ మీద యెహోవాకు ఆరోపణ చేస్తాడు. మరియు యెహోవా నిన్ను పాపం చేసిన నేరస్థునిగా చూస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 15:9
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు; అవసరతలో ఉన్న వారి మొరను ఆయన ఆలకిస్తారు.


నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను.


“దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.


ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; బాధితుల మొరను ఆయన విస్మరించరు.


“విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు.


మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.


అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.


తన పొరుగువానిని తిరస్కరించేవారు పాపులు, బీదలకు దయ చూపేవాడు ధన్యుడు.


బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు, తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు.


ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి, అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు,


మూర్ఖుల పథకాలు పాపం, ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు.


పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.


అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.


“యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి మనస్సును పరీక్షించి, ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.”


‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు.


ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధసాక్ష్యం దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి.


నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అనుమతి లేదా? లేదా నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.


ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి.


ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు.


తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో,


కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.


లేదా, “దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కోసం ఆయన ఆరాటపడుతున్నారని” లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా?


చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి.


సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు!


సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ